Navratri 2023: జ్యోతిష్యం ప్రకారం పితృ అమావాస్య అక్టోబర్ 14తో ముగిసింది. ఇవాళ్టి నుంచి అంటే అక్టోబర్ 15 నుంచి శరత్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక సంయోగంతో కొన్ని రాశులవారికి అదృష్టంగా మారనుంది. అంతులేని ధన సంపదలు వచ్చి పడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో అత్యంత పవిత్రంగా భావించే పండుగ రోజులు దేవీ నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు. ఇవాళ అంటే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. అశ్విని మాసం ప్రతిపద తిధిన మొదలయ్యాయి. నిన్నటికి పితృ అమావాస్య తొలగిపోయింది. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం కూడా నిన్న ముగిసింది. ఇక ఇవాళ్టి నుంచి నవ రాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఎన్నో శుభ సంయోగాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులకు అత్యంత లాభదాయకం కానుంది. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవరాత్రి మొదటి రోజే శశ రాజయోగం, భద్ర యోగం, బుధాదిత్య యోగం ఏర్పడనున్నాయి. ఇవి ఏర్పడటం 30 ఏళ్ల తరువాత ఇదే. అంటే 30 ఏళ్ల తరువాత ఈ రాశులకు అంతులేని ధన సంపదలు వచ్చి పడనున్నాయి. మరోవైపు త్రిగ్రహ యోగం కూడా ఏర్పడుతోంది. ఈ ప్రభావం 3 రాశులపై చాలా ప్రత్యేకంగా ఉండనుంది. త్రిగ్రహ యోగం మూడు రాశుల జాతకాన్ని పూర్తిగా మార్చేయనుంది. 30 ఏళ్ల వరకూ ఈ యోగం ఉంటుంది. అత్యంత లాభదాయకంగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం నిరంతరం సిద్ధిస్తుంది. 


సింహ రాశి జాతకులకు 30 ఏళ్లకు ఏర్పడనున్న త్రిగ్రహ యోగం చాలా సానుకూలంగా ఉండనుంది. ఈసమయంలో ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగస్థులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడంతో మీ సంపాదన గణనీయంగా పెరుగుతుంది. మీరు చేపట్టే అన్ని పనులకు దుర్గాదేవి కటాక్షం లభిస్తుంది. వ్యాపారులకు అనువైన సమయం. పెట్టుబడులు లాభించి గణనీయమైన లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. 


జ్యోతిష్యం ప్రకారం కన్యా రాశి జాతకులకు త్రిగ్రహ యోగం అనుకూల పరిణామాలు కలుగజేయనుంది. వ్యాపారం కూడా ఎలాంటి నష్టాల్లేకుండా సజావుగా సాగుతుంది. మంచి ఆదాయం సమకూరుతుంది. పూర్వీకుల నుంచి పెద్దఎత్తున ఆస్థి లభించవచ్చు. అదృష్టం అన్నివైపుల్నించి తలుపు తడుతుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆకశ్మిక ధనలాభం కలగడం వల్ల ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యంపై కాస్త అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఇంట్లో వయసు మళ్లినవారి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి.


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రుల ప్రభావంతో కొన్ని రాశులపై అత్యంత శుభ పరిణామాలు కలగవచ్చు. పనుల నిమిత్తం విదేశీ ప్రయాణం చేయవచ్చు. వ్యాపారులు రెట్టింపు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు మంచి ప్రయోజనం కల్గిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. త్రిగ్రహ యోగం కారణంగా కర్కాట రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలగనుంది. గతంలో ఎక్కడో ఎప్పుడో నిలిచిపోయిన డబ్బు ఒక్కసారిగా చేతికి అందడంతో ఊహించని లాభాలు కలగనున్నాయి. 


Also read: Fengshui vastu: ఇంట్లో వాస్తుదోషాన్ని దూరం చేసే అద్భుతమైన ఫెంగ్ షుయీ చిట్కాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook