Fengshui vastu: ఇంట్లో వాస్తుదోషాన్ని దూరం చేసే అద్భుతమైన ఫెంగ్ షుయీ చిట్కాలు

Fengshui vastu: హిందూమతం ప్రకారం జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు చాలా ప్రాదాన్యత ఉంది. ఒక్కొక్కరి లేదా ఇంట్లో జరిగే పరిణామాలపై జాతకం ప్రభావం తప్పకుండా ఉంటుందంటారు. ఈ జాతకాన్ని ప్రభావితం చేసేది గ్రహాలు లేదా వాస్తు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2023, 07:28 AM IST
Fengshui vastu: ఇంట్లో వాస్తుదోషాన్ని దూరం చేసే అద్భుతమైన ఫెంగ్ షుయీ చిట్కాలు

Fengshui vastu: జ్యోతిష్యం అనేది మనిషి జీవితాన్ని, జాతకాన్ని నిర్ణయిస్తే వాస్తు అనేది ఇంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది. ఇంటి పరిస్థితుల ఆధారంగా ఆ ఇంట్లో వ్యక్తుల జాతకాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వాస్తు శాస్త్రానికి హిందూమతంలో ఎనలేని విశిష్టత ఉంది. వాస్తు కేవలం భారతదేశంలోనే కాదు..చాలా దేశాల్లో కూడా ఉంది.

వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణం, ఇంట్లో వస్తువుల అమరికను గూర్చి చెబుతుంది. కొత్త ఇళ్లు ఎంత విలాసవంతంగా, అందంగా కట్టుకున్నా చాలా సందర్భాల్లో ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు. వాస్తు దోషముంటేనే ఇలా జరుగుతుంది. ఇంటి గుమ్మాల అమరిక, ప్రదాన ద్వారం ఏ దిశలో ఉంది, నీటి సౌకర్యం ఎటువైపుంది, ఇంటి డెకొరేషన్ కోసం వినియోగించే సీనరీలు, వాల్ హోర్డింగులు, క్లాక్, కిచెన్, వాష్రూమ్ ఇలా వివిధ రకాల వస్తువులను ఎలా అమర్చుకున్నామనేది చాలా ముఖ్యం. వీటిలో ఏ మాత్రం అవకతవకలు జరిగినా అది కూడా వాస్తు దోషం కిందకు వస్తుంది. 

ఇళ్లు, ఆఫీసు లేదా షాప్, ఫ్యాక్టరీ నిర్మాణంలో వాస్తుదోషం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వాస్తు అనేది అక్కడుండేవారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం చాలా వరకూ సమస్యలకు కారణం వాస్తుదోషమే అంటారు. చాలామంది ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా ఆందోళన చెందుతుంటారు. వాస్తు నిపుణులు మాత్రమే ఆ ఇంట్లో లోపమెక్కడ ఉందో పరిశీలించి చెప్పగలరు. చైనా వాస్తు విధానం ప్రపంచంలో చాలావరకూ అనుకరిస్తుంటారు. అదే ఫేంగ్‌షుయీ. ఇది అత్యంత ప్రాచీన విధానం.

ఫేంగ్‌షుయీ వాస్తు సూచనలు

ప్రధాన గుమ్మానికి ముందు స్థంభం, గోయి లేదా మరేదైనా లోపముంటే అక్కడ అద్దం అమర్చుకోవాలి. ఇంట్లో పిల్లర్ ప్రభావాన్ని తగ్గించేందుకు రెడ్ రిబ్బన్‌లో మురళిని కట్టి పిల్లర్ కు అమర్చారు. ఇలా అమర్చేటప్పుడు మురళి ముఖభాగం కిందివైపుండాలి. బెడ్రూమ్‌లో ఏదైనా వాస్తుదోషం ఉంటే ఆ గది గోడపై బాగువా యంత్రాన్ని అమర్చుకోవాలి. 

ఇంట్లో ముళ్లున్న మొక్కలు పెంచకూడదు. డైనింగ్ రూమ్ గోడలకు అద్దం అమర్చుకోవాలి. ఇంట్లోంచి నెగెటివ్ శక్తుల్ని దూరం చేసేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గాలి గంటను అమ్చుకోవాలి. అంటే గాలి ఆధారంగా మోగే గంటను సెట్ చేయాలి. టాయ్‌లె‌ట్, స్నానం రెండూ ఒకే గదిలో ఉంటే టాయ్‌లెట్ సీట్ ఎత్తులో అమర్చుకోవాలి. ఫలితంగా నెగెటివ్ ప్రభావం తగ్గుతుంది. 

Also read: Surya Grahan effect: కాసేపట్లో సూర్యగ్రహణం.. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News