Total Number Effect: జ్యోతిష్యశాస్త్రంలో భాగం సంఖ్యాశాస్త్రం కూడా. కొంతమంది పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తక్కువ సమయంలోనే నేతలుగా ఎదుగుతారు. ఈ తేదీల్లో పుట్టినవారు అంతేనట. ఆ వివరాలు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంఖ్యాశాస్త్రం అనేది టోటల్ నెంబర్ ఆధారంగా నడుస్తుంది. టోటన్ నెంబర్‌ను బట్టి ఆ వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్ గురించి చెప్పవచ్చు. టోటల్ అనేది ఆ వ్యక్తి పుట్టిన తేదీకు సంబంధించింది. అంటే 2, 11, 20, తేదీల్లో పుట్టిన వ్యక్తి టోటల్ 2 అవుతుంది. సంఖ్యాశాస్త్రంలో ప్రతి అంకె సంబంధం ఏదో ఒక గ్రహంతో ఉంటుంది. టోటల్ 2 సంబంధం చంద్రుడితో ఉంది. అందుకే ఈ టోటల్ 2 జాతకులపై చంద్రుడి ప్రభావం కన్పిస్తుందట.


టోటల్ 2 వ్యక్తుల స్వభావం


టోటల్ 2 జాతకం చంద్రుడి ప్రభావం కారణంగా శాంతంగా, కోమల మనస్తత్వం కలిగినవారిగా ఉంటారు. ఈ వ్యక్తులు స్వభావరీత్యా సరళంగా రిక్వెస్టెడ్‌గా ఉంటారు. అందుకే కొన్ని విషయాల్లో త్వరగా ఉద్వేగానికి లోనవుతారు. ఈ లక్షణాలు వారిని ప్రజాకర్షకులుగా మారుస్తాయి. టోటల్ 2 జాతకం కలిగినవారితో కలిసున్న వ్యక్తులు..అంత త్వరగా దూరం కారు. వీరికి మల్టీ టాస్కింగ్ అంటే చాలా ఇష్టం. 


టోటల్ 2 వ్యక్తులు పుట్టుకతో నాయకులు


టోటల్ 2 జాతకం కలిగినవారు పనిలో నిర్లక్ష్యం సహించరు. తమకు తాము పర్ఫెక్షనిస్ట్‌గా ఉంటూనే ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. లేకపోతే ఆగ్రహం చెందుతారు. అయితే చంద్రుడి శాంత స్వభావం కారణంగా ఎక్కువసేపు కోపంగా ఉండలేరు. టోటల్ 2 జాతకులు నాయకత్వంలో గట్టిగా ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు బాగుంటాయి. మంచి నాయకులుగా ఎదుగుతారు. 


అందంవైపు త్వరగా ఆకర్షితులవుతారు


టోటల్ 2 జాతకులు అందంవైపు త్వరగా ఆకర్షితులవుతారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అది అందమైన వస్తువులు కావచ్చు లేదా అందమైన వ్యక్తులు కావచ్చు. అయితే ఈ లక్షణం ఒక్కోసారి వీరిని కష్టాల్లో పడేస్తుంది. ఈ జాతకం కలిగినవారికి విదేశీ ప్రయాణం యోగం ఉంటుంది. విదేశాలతో సంబంధించిన వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. 


ఏ విషయాల్లో అప్రమత్తత అవసరం


ఈ జాతకం కలిగినవారు అమావాస్యనాడు కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. తరచూ నిర్ణయాలు మారుస్తుంటారు. ఈ కారణంతో జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ఉంటే మంచిది. లేకపోతే త్వరగా డిప్రెషన్‌కు లోనవుతారు. ఒకవేళ వెండి గ్లాసులో పాలు లేదా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే చంద్రుడు బలోపేతమై..మంచి ఫలాలిస్తాడు. సోమవారం నాడు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయాలి. 


Also read: Marriage Tips: పెళ్లి ఆలస్యమైనా..ఆటంకాలు ఎదురైనా ఇలా పూజలు చేస్తే చాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook