Rahu Dosha Upay:  జ్యోతిష్య శాస్త్రంలో రాహువు మరియు కేతువులను పాప లేదా దుష్ట లేదా ఛాయా గ్రహాలు అని పిలుస్తారు. జాతకంలో రాహువు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి ఉన్నత స్థానం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా రాజులా జీవితాన్ని గడుపుతారు. మరోవైపు బలహీన రాహువు మీ జీవితాన్ని నాశనం చేస్తారు. రాహువు యెుక్క మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. మీ జాతకంలోని రాహు దోషం తొలగిపోవాలంటే మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

** జాతకంలో రాహువు స్థానం బలహీనంగా ఉంటే... ఆ వ్యక్తి ఆలోచన శక్తిని కోల్పోతాడు. అతడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. మీరు గందరగోళంలో పడతారు. మీరు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ఇది మీ మానసిక స్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. 
** రాహు దోషం ఉన్నవారు కలలో తరచుగా పాములను చూస్తారు. ముఖ్యంగా చనిపోయిన పాము కలలో కనిపిస్తే అది రాహు దోషానికి సంకేతం. దాని చెడు ప్రభావాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలి. 
** గోర్లు విరగడం లేదా చెడ్డ గోళ్లు, వేగంగా జుట్టు రాలడం కూడా జాతకంలో రాహువు అస్తమించడం లేదా బలహీనపడడం వంటి లక్షణాలు.
** కలలో చనిపోయిన బల్లిని చూడటం కూడా చెడు రాహువు సంకేతం. అలాంటి కల మానసిక ఒత్తిడి మరియు డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది.
** రాహు దోషం ఉంటే ఇంట్లో ఎప్పుడూ గొడవలు, కలహాలు ఉంటాయి.


రాహువు యొక్క అశుభ ఫలితాలను నివారించే మార్గాలు:
** రాహు దోషాన్ని నివారించడానికి ప్రతిరోజూ 108 సార్లు 'ఓం రాహు రాహవే నమః' అనే మంత్రాన్ని జపించండి. రాహు కవచాన్ని పఠించడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
** రాహువు జాతకంలో అననుకూల పరిస్థితులను నివారించడానికి సులభమైన మార్గం పక్షులకు మిల్లెట్ తినిపించడం.


Also Read: Shukra Mahadasha: మీ జాతకంలో శుక్ర మహాదశ ఉందా? అయితే 20 ఏళ్లుపాటు మీరే కింగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook