Rahu Transit 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గోచారం లేదా రాశి పరివర్తనం చెందినట్టే  రాహు గ్రహానికి సైతం గోచారం ఉంటుంది. అయితే రాహు కేతువులు గ్రహ గోచారం ఇతర గ్రహాలకున్నట్టు తక్కువ సమయం ఉండదు. అన్ని సందర్భాల్లో రాహువు చెడుకు సంకేతం కూడా కానే కాదంటున్నారు జ్యోతిష్య పండితులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహువు ఏకంగా ఏడాదిన్నర సమయం తరువాత గోచారం చేయనున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన రాహువు మేష రాశి నుంచి బయటికొచ్చి మీన రాశిలో ప్రవేశించనున్నాడు. మీన రాశికి అధిపతి గురుడు. హిందూమతం ప్రకారం రాహువును పాప గ్రహంగా, క్రూరంగా రకరకాలుగా భావిస్తారు. రాహువు ఎల్లప్పుడూ వక్రమార్గంలోనే పయనిస్తుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు రాహువు ఏడాదిన్నర సమయం తీసుకుంటాడు. రాహువు అంటే జాతకం ప్రకారం అందరూ భయపడే పరిస్థితి ఉన్నా చాలా సందర్భాల్లో రాహువు ప్రభావం అద్భుతమైన లాభాల్ని ఇచ్చేదిగా ఉంటుందట. ఇందులో భాగంగానే ఈసారి రాహువు గోచారంతో మీన రాశిలో ప్రవేశించనుండటం వల్ల అక్టోబర్ 30 నుంచి ఈ మూడు రాశుల జీవితంలో  మహర్దశ ప్రారంభమైనట్టే. ఏడాదిన్నర వరకూ అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. కొత్త ఇళ్లు, కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. కెరీర్ అద్భుతంగా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. ధన సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా 3  రాశులకు అత్యద్బుతంగా ఉండనుంది.


వృషభ రాశి జాతకులకు రాహువు గోచారం ప్రభావం ఊహించనంత లాభాలు తెచ్చిపెట్టనుంది. ఈసారి అంటే అక్టోబర్ 30వ తేదీన జరగనున్న రాహువు గోచారం మీ రాశిలోని ఏకాదశ పాదంలో ఉంటుంది. దాంతో అత్యంత శుభప్రదమైన స్థానం లభిస్తుంది. మీ ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది. దీర్ఘకాలంగా చేయాలనుకున్న పనులు పూర్తవుతాయి. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారికి విజయం లభిస్తుంది. కచ్చితంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇక ఏ సమస్యా ఉత్పన్నం కాకపోవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. 


రాహువు మీన రాశిలో ప్రవేశించనుండటంతో వృశ్చిక రాశి జాతకులకు ఉద్యోగరీత్యా అద్భుతంగా ఉంటుంది. పదోన్నతితో పాటు జీతం పెరుగుతుంది. ఇక వ్యాపారులైతే కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఉన్న వ్యాపారంలో అమితమైన లాభాలు పొందుతారు. మొత్తానికి ఈ రాశి జాతకులకు ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


రాహువు గోచారం ప్రభావంతో కన్యా రాశి జాతకులకు గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే. మరో ఏడాదిన్నర వరకూ ఈ రాశి జాతకులు వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. కుండలిలో అష్టమ భాగంలో రాహువు ఉండటం వల్ల ఆర్ధికంగా ఎలాంటి సమస్య రాదు. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఫలితంగా ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. అన్నింటికీ మించి ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Also read: Jupiter Retrograde 2023: ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం, డిసెంబర్ 31 వరకూ తిరుగుండదిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook