Jupiter Retrograde 2023: గ్రహాల కదలిక రెండు రకాలుగా ఉంటుందంటారు. సక్రమ మార్గంలో పయనించడం, రెండవది తిరోగమనం అంటే వక్రమార్గం. గ్రహాలకు దేవగురువుగా పిల్చుకునే గురుడు మేష రాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఈ ప్రభావం ముఖ్యంగా 4 రాశులపై అమితంగా ఉండనుంది. ఆ వివరాలు మీ కోసం..
జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. సూర్యుడిని గ్రహాలకు రారాజుగా, బుధుడిని యువరాజుగా పిల్చినట్టే గురుడిని గ్రహాలకు దేవగురువుగా పరిగణిస్తారు. గురుగ్రహానికి జ్యోతిష్యంలో అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఎందుకంటే గురుడిని సుఖ సంతోషాలకు, సౌభాగ్యానికి ప్రతికగా భావిస్తారు. సెప్టెంబర్ 4న అంటే రెండ్రోజుల క్రితమే గురుడు మేష రాశిలో తిరోగమనం చెందాడు. కుండలిలో గురుడు శుభ స్థానంలో ఉంటే అంటే బలంగా ఉంటే జాతకుల జీవితంలో పెద్దఎత్తున సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.. సెప్టెంబర్ 4న మేష రాశిలో తిరోగమనం చెందిన గురుడు డిసెంబర్ 31 వరకూ అదే స్థితిలో ఉంటాడు. అంటే 117 రోజుల వరకూ ఈ నాలుగు రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. మేషరాశిలో గురుడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
కర్కాటక రాశి జాతకులకు గురుడి తిరోగమనం ప్రభావంతో కీలకాంశాల్లో విజయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. నిరుద్యోగులకు అనువైన సమయం. మంచి ఉద్యోగావకాశాలు వస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు రావడం వల్ల కెరీర్ బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్య రాకపోవచ్చు.
తుల రాశి జాతకులకు గురుడి తిరోగమనం లేదా వక్రమార్గం కారణంగా డిసెంబర్ 31 వరకూ అంటే 117 రోజులు ఓ వరం లాంటివి. ఊహించనివిధంగా ధనలాభం కలుగుతుంది. చాలా అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంపదతో లాభాలుంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు అనువైన సమయం.
మేష రాశి జాతకులకు గురుడి తిరోగమనం ప్రభావంతో అంతా అద్భుతంగా ఉంటుంది. జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరగవచ్చు. వ్యాపారాలకు చాలా అనువైన సమయం. ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. పెళ్లి కోసం మంచి మంచి సంబంధాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. కుటుంబసభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
గురుగ్రహం మేష రాశిలో వక్రమార్గం కారణంగా మిధున రాశిపై కూడా ఊహించని ప్రయోజనాలు కల్గించనుంది. ఈ జాతకం వారిపై అపారమైన ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో సహజంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. ఈ జాతకం వారి ఆదాయం అన్నివైపుల్నించి పెరగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు.
Also read: Dussehra Navratri: నవరాత్రి ప్రారంభం ఎప్పుడు, విజయ దశమి ప్రాధాన్యత ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook