Satrun Travel in Shatabhisha Nakshatra 2023: శనిదేవుడిని కలియుగ న్యాయమూర్తిగా భావిస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే శని గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశితోపాటు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రాలజీలో శతభిషా నక్షత్రానికి అధిపతిగా రాహవును పరిగణిస్తారు. ఈ నక్షత్రం యెుక్క మెుదటి మరియు చివరి దశకు అధిపతిగా బృహస్పతిని భావిస్తారు. రెండవ మరియు మూడవ దశకు అధిపతి శని దేవుడు. ప్రస్తుతం శని శతభిషా నక్షత్రం మొదటి దశలో ఉన్నాడు. అక్టోబరు 17 వరకు అదే రాశిలో ఉంటాడు. శని నక్షత్రం యొక్క సంచారం కారణంగా ఈ సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


ఈ రాశులవారు జాగ్రత్త


కర్కాటకం: శని సంచారం ఈ రాశి వారికి అస్సలు కలిసిరాదు. వీరి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీకు శత్రువులు పెరుగుతారు. అందుకే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 


కన్య: శని గోచారం వల్ల కన్యారాశి వారు అక్టోబరు 17 వరకు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో పెద్దగా లాభాలు ఉండవు. ఈ  సమయంలో పెట్టుబడులు పెట్టకండి. 


Also Read: Surya Grahan 2023: సూర్యగ్రహణం ఎవరికి కలిసి వస్తుందో, ఎవరికి కలిసిరాదో తెలుసుకోండి?


వృశ్చికం: మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ కు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు అధికమవుతాయి. ఆస్తి వివాదాలు మిమ్మల్ని చుట్టముడతాయి. 


కుంభం: శని సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివాదాలు పెరుగుతాయి. అనుకున్న పనులు జరగవు.


మీనం: ఈ రాశి వారిపై శని సడే సతి కొనసాగుతోంది. రాహువు యొక్క నక్షత్రంలో శని ఉండటం వల్ల మీనరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. డబ్బు వృథా అవుతుంది. ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 


Also Read: Surya Guru yuti 2023: ఏప్రిల్ 22 తర్వాత ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి ఉందా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి