Shani Chandra yuti 2023: ఈరోజు నుంచి వీరికి అస్సలు టైం కలిసి రాదు.. ఇందులో మీ రాశి ఉందా?
Shani Chandra yuti 2023: ఇవాళ కుంభరాశిలో శని, చంద్రుడి కలయిక జరిగింది. ఈ రెండు గ్రహాల కలిసి అశుభకరమైన విషయోగం చేశారు. ఇది కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Vish Yog effect: ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. గ్రహాల కాలానుగుణంగా శుభ లేదా అశుభయోగాలను ఏర్పరుస్తాయి. ఇవాళ ఉదయం చంద్రుడు మకరరాశి నుండి బయటకు వెళ్లి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఇదే రాశిలో శని సంచరిస్తున్నాడు. దీంతో కుంభరాశిలో శని, చంద్రుడు కలయిక ఏర్పడింది. ఈ రెండు గ్రహాల సంయోగం ల్ల విషయోగం ఏర్పడుతుంది. దీనిని అశుభకరమైన యోగంగా పేర్కొంటారు. విషయోగం ఏయే రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
ఈ రాశులపై విష యోగం ప్రతికూల ప్రభావం
కన్య రాశి
ఈ రాశి యెుక్క ఐదవ మరియు ఆరవ ఇంటికి శనిదేవుడు అధిపతి. పైగా ఆరో ఇంట్లో శని సంచరిస్తున్నాడు. విషయోగం ఈ రాశి వారిపై చెు ప్రభావాన్ని చూపనుంది. దీని వల్ల వీరు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. మీరు కెరీర్ లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. శత్రువుల మిపై విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు.
వృశ్చిక రాశి
చంద్రుడు మరియు శని కలయికతో ఏర్పడిన విష యోగం వృశ్చిక రాశి వారిని అనేక ఇబ్బందులను గురిచేస్తుంది. మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కుటుంబంలో విభేదాలు వస్తాయి. మీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీకు ఆస్తి తగాదాలు ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.
Also Read: Mangal Gochar 2023: జూలై 1 వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా?
కుంభ రాశి
ఈ రాశిలోనే విష యోగం ఏర్పడుతోంది. దీంతో వీరి లైఫ్ కష్టాలమయంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సహద్యోగులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో గొడవలు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఈ సమయం అంతగా కలిసి రాదు. మీరు అహంకారాన్ని వీడాలి, లేకపోతే మీకే నష్టం.
Also Read: Surya Nakshatra Transit: 2023లో సూర్యుడు ఏయే తేదీల్లో ఏయే నక్షత్రాల్లో సంచరించనున్నాడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook