Saturn Remedies on Makar Sankranti 2023: జోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం దాని నిర్ణీత సమయంలో ప్రయాణిస్తుంది. 2023 జనవరి 17న కుంభ రాశిలోకి శని గ్రహం ప్రవేశించనుంది. 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని సంచరిస్తున్నాడు. ఈ సంచారం అనేక రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 5 రాశిచక్ర గుర్తులు ఈ సంచారం ద్వారా ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. సడే సతి 3 రాశుల మీద, శని 2 రాశుల మీద ప్రారంభం కాబోతోంది. శని సంచారం ఏ రాశుల వారి జీవితాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం. మకర సంక్రాంతి నాడు ఈ పరిహారాలను చేయడం వలన శని దుష్ప్రభావాల నంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి:
కుంభ రాశిలో శని సంచారంతో కర్కాటక రాశి వారి జీవితాల్లో ధైయ ప్రభావం మొదలవుతుంది. ఈ సమయం చాలా కఠినంగా ఉంటుంది. శని సంచార ప్రభావం కర్కాటక రాశి వారి ఆరోగ్యంపై గరిష్టంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. కుటుంబ సమస్యల వల్ల కూడా మీరు ఒత్తిడికి గురవుతారు. కార్యాలయంలో అనేక రకాల అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. 


మకర సంక్రాంతి రోజున శనిని శాంతింపజేయడం ఇలా:
కర్కాటక రాశి వారు మకర సంక్రాంతి రోజు నుంచి 'ఓం ప్రాణ్ ప్రిన్ ప్రాణ్ స: శనయే నమః' మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి.


వృశ్చిక రాశి: 
శని సంచరించిన వెంటనే వృశ్చిక రాశి వారికి ధైర్యసాహసాలు సవాల్ మొదలవుతుంది. ఈ రాశి చక్రంలోని నాల్గవ ఇంట్లో శని సంచారం జరగబోతోంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబంలో అశాంతి వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుండదు. అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆస్తి విషయంలో అనేక రకాల వివాదాలు ఉండవచ్చు.


మకర సంక్రాంతి నాడు శని పరిహారాలు:
మకర సంక్రాంతి రోజున వృశ్చిక రాశి వారు హనుమంతుడిని పూజించండి. అలాగే శని, మంగళవారాల్లో సుందరకాండ పఠించడం వల్ల మేలు జరుగుతుంది.


మకర రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారిపై అననుకూల ప్రభావాన్ని చూపుతుంది. శని యొక్క సడే సతి నుంచి విముక్తి పొందలేరు కానీ ఈ సమయంలో అవరోహణ సడే సతి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గౌరవం విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇంట్లో గతంతో పోలిస్తే ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది. అజాగ్రత్తతో ఏ పనీ చేయకండి.


మకర సంక్రాంతి నాడు శాంతికి పరిహారాలు: 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజున మకర రాశి వారు ఏడు ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మేలు జరుగుతుంది.


కుంభ రాశి:
30 సంవత్సరాల తర్వాత శని సంచారం వల్ల కుంభ రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. సాడే సతి ప్రభావం వల్ల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు శారీరక సమస్యలతో పాటు ఇంటి సమస్యలు, కెరీర్ సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రభావం చూపుతుంది. లావాదేవీ సమయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.


మకర సంక్రాంతి రోజున శని పరిహారాలు:
కుంభ రాశి వారు శివుడిని మరియు హనుమంతుడిని క్రమం తప్పకుండా పూజించడం మంచిది. శనివారం నాడు సుందరకాండ పఠించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


Also Read: Lalit Modi Hospitalised: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీకి అనారోగ్యం.. ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్!  


Also Read: Maruti Brezza CNG: టాటా నెక్సాన్‌కు పోటీగా.. మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ! 25 కిలోమీటర్ల మైలేజ్‌  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.