Former IPL Chairman Lalit Modi Hospitalised after Double Covid 19 in 2 Weeks: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ మరియు వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఆక్సిజన్ సపోర్ట్ తో లలిత్ మోడీ ఆస్పత్రిలో ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సోకడంతో పాటు న్యుమోనియా కూడా అటాక్ అవ్వడంతో ఆయన ఐసీయూలో చేరారు. 14 రోజుల వ్యవధిలో రెండు సార్లు కరోనా సోకిందని, న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతోనే ఆస్పత్రిలో చేరానని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ స్వయంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
'రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకింది. కోవిడ్ కారణంగా నిర్బంధంలో ఉన్న సమయంలో న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతో కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇద్దరు వైద్యులు మరియు సూపర్ స్టార్ సూపర్ ఎఫీషియెంట్ కొడుకుతో కలిసి లండన్‌లోని ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తు ఇప్పటికీ 24/7 బాహ్య ఆక్సిజన్‌తో ఉండాల్సి వచ్చింది. నేను అందరికీ ధన్యవాదాలు చెపుతున్నా' అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో లలిత్ మోడీ పేర్కొన్నారు.
హాస్పిటల్ బెడ్‌పై తాను ఉన్న ఫొటోస్, వీడియోస్ కూడా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పోస్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ ఫలితం, 87 mm Hg రీడింగ్‌తో కూడిన ఔల్స్ ఆక్సిమీటర్ మరియు ఛాతీ ఎక్స్-రేలను మోడీ పోస్ట్ చేశారు. ఇవి చూసిన అందరూ 'గెట్ వెల్ సూన్' అంటూ పోస్ట్ చేస్తున్నారు. క్రికెటర్ హర్భజన్ సింగ్, మాజీ ప్రేయసి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్.. మోడీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు భారత టీ20 లీగ్ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ 2022 జులైలో సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇద్దరు కలిసి మాల్దీవుల్లో, లండన్‌లో షికార్లు చేసిన ఫొటోలు ఆయన షేర్ చేశారు. సుస్మిత తన బెటర్ హాఫ్ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం తాము డేటింగ్‌లోనే ఉన్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. అయితే కొద్దీ రోజులకే మోడీ, సుస్మితా విడిపోయారు.
మినాల్ మోడీతో లలిత్ మోడీకి వివాహమైంది. ఈ జంట 1991 అక్టోబర్ 17న ముంబైలో వివాహం చేసుకుంది. క్యాన్సర్ కారణంగా మినాల్ మోడీ 2018 డిసెంబర్‌లో మరణించారు. అనంతరం సుస్మితా సేన్‌తో డేటింగ్ చేశారు. ఇక పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో భారత దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీ.. 2010 నుంచి లండన్‌లోనే ఉంటున్నారు.
Also Read: Sania Mirza Retirement: చివరి టోర్నీ ఇదేనంటూ.. రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.