Shani Planet Retrograde 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. అయితే శనిదేవుడు మాత్రం అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ఏడాదిన్నరకొకసారి తన రాశిచక్రాన్ని మారుస్తాడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే శని స్థానంలో చిన్న మార్పు కూడా ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శని ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో (Saturn Retrograde in Capricorn 2022) ఉన్నాడు. అక్టోబరు 23 వరకు అదే స్థితిలో ఉంటాడు. దీని తర్వాత శని వచ్చే ఏడాది జనవరిలో సంచరిస్తాడు. మకరరాశిలో శని వక్రి కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): మకరరాశిలో శని తిరోగమనం ఈ రాశివారికి కలిసి వస్తుంది. ఈరాశివారు ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన ప్రయోజనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. బిజినెస్ పెరుగుతుంది. 


ధనుస్సు (Sagittarius): అక్టోబరు వరకు శని తిరోగమనం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. వీరు భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఇరుక్కుపోయిన డబ్బు తిరిగివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు స్టాక్ మార్కెట్ నుండి లాభం పొందవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి.


మీనం (Pisces): తిరోగమన శని మీన రాశి వారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. ఆర్థికంగా మెరుగుపడతారు. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. పెద్ద డీల్ ఫైనల్ కావచ్చు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది.


Also Read: Sun Tranit 2022: సెప్టెంబర్‌లో అతిపెద్ద 'గ్రహ మార్పు'.. ఈ రాశులకు లక్కే లక్కు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook