Shani Dev Effects 2023: జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని న్యాయ దేవుడు అని అంటారు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెలలో శనిదేవుడు రివర్స్ లో కదలనున్నాడు. శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. శనిదేవుడు చెడు దృష్టి నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. మేషం
శని వక్ర దృష్టి కారణగా మీ లైఫ్ లో అనేక అడ్డంకులు వస్తాయి. మీరు లవ్ లో సమస్యలను ఎదుర్కోంటారు. దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా హార్డ్ వర్క్ మరియు నిజాయితీతో చేయండి.
పరిహారం - మీ వైవాహిక జీవితంలో గొడవలు పోవాలంటే.. మే నెలలో మీ జీవిత భాగస్వామికి బెల్లం తినిపించకండి. మర్రి చెట్టు వేర్లకు పాలు పోయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. 
2. కన్య
కన్యా రాశి వారు ప్రేమ వ్యవహారంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. బంధువుల మధ్య అపార్ధాలు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకు కోపం రాకుండా చూసుకోవాలి. 
పరిహారం- కన్యా రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. దుర్గాదేవి ఆలయానికి వెళ్లి మట్టి కుండలో తేనె సమర్పించాలి.
3. తులారాశి
తులారాశి వారి ప్రేమ జీవితంపై శని మూడవ దశ ప్రభావం చూపుతుంది. మీ ప్రేమ వ్యవహారంలో సమస్యలు వస్తాయి.  మీ దాంపత్య జీవితంలో గొడవలు తలెత్తుతాయి. మీ దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. 
పరిహారం- తులారాశి వారు శనిగ్రహం యొక్క చెడు దృష్టిని నివారించడానికి ఈ నెలలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఆదివారం ఉప్పు తినడం మానుకోండి. ప్రతి మంగళవారం ఆలయంలో బెల్లంతో చేసిన స్వీట్లను సమర్పించండి.


Also Read: Surya Chandra Yuti 2023: త్వరలో వృషభ రాశిలో అశుభకరమైన 'అమావాస్య దోషం'... ఈ 3 రాశుల వారు జాగ్రత్త..


4. మకరం
శని చెడు ప్రభావం వల్ల మీకు ఇతరులతో సంబంధాలు చెడిపోతాయి. మీ లవ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. 
పరిహారం- శుక్రవారాల్లో ఆడపిల్లలకు మిఠాయిలు పంచి మీ సామర్థ్యానికి అనుగుణంగా పేదలకు, బ్రహ్మణాలకు భోజనం పెట్టడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
5. మీనం
మీన రాశి వారికి ప్రేమ వ్యవహారాల పరంగా ఈ నెల మంచిది కాదు. మీ దాంపత్య జీవితం విడాకులకు దారితీసే ప్రమాదం ఉంది. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకోవద్దు. 
పరిహారం- మీ లైఫ్ పార్టనర్ తో బంధాన్ని బలోపేతం చేయడానికి మర్రి చెట్టుకు పాలు పోయండి. అంతేకాకుండా ఇంటి దగ్గర వేప మెుక్కను నాటండి. దేవుడికి ఎండు కొబ్బరి సమర్పించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 


Also Read: Vrishabha Sankranti 2023: వృషభ సంక్రాంతి ఎప్పుడు? స్నాన, దాన సమయం తెలుసుకోండి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook