Vrishabha Sankranti 2023: వృషభ సంక్రాంతి ఎప్పుడు? స్నాన, దాన సమయం తెలుసుకోండి..

Vrishabha Sankranti 2023: ఈ నెల 15న సూర్యభగవానుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అంటారు. ఈరోజున స్నాన మరియు దానానికి విసేష ప్రాధాన్యత ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 9, 2023, 10:18 AM IST
Vrishabha Sankranti 2023: వృషభ సంక్రాంతి ఎప్పుడు? స్నాన, దాన సమయం తెలుసుకోండి..

Vrishabha Sankranti 2023 date: హిందూ క్యాలెండర్ ప్రకారం, సూర్య దేవుడు ఏప్రిల్ 14 నుండి మేషరాశిలో కూర్చున్నాడు. మే 15, సోమవారం ఉదయం 11.58 గంటలకు ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తాడు. దీనినే వృషభ సంక్రాంతి అంటారు. అదే రాశిలో భానుడు జూన్ 15 వరకు ఉంటాడు. ఆ తర్వాత ఆరోజు సాయంత్రం 06.29 గంటలకు మిథునరాశిలో సంచరిస్తుంది. వృషభరాశిలో సూర్యుని సంచారం 12 రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. వృషభ సంక్రాంతి రోజున స్నానం మరియు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. 

వృషభ రాశి సంక్రాంతి సమయం 
ఈ ఏడాది వృషభ సంక్రాంతిని మే 15న ఉదయం 11.58 గంటలకు జరుపుకోనున్నారు. ఈ రోజు పుణ్యకాల, మహాపుణ్యకాలాలలో స్నానం, దానం చేయడంతోపాటు సూర్యభగవానుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి.
పుణ్యకాల సమయం 
వృషభ సంక్రాంతి శుభ సమయం యొక్క మొత్తం వ్యవధి 7 గంటల 3 నిమిషాలు. ఈ రోజు తెల్లవారుజామున 04.55 గంటల నుండి 11.58 గంటల వరకు శుభ ముహూర్తాలు ఉంటాయి.
మహా పుణ్యకాల సమయం
వృషభ సంక్రాంతి రోజున జరిగే మహా పుణ్యకాల మొత్తం వ్యవధి 2 గంటల 14 నిమిషాలు. ఈ రోజున మహాపుణ్యకాలం ఉదయం 09:44 గంటలకు ప్రారంభమై 11:58 గంటలకు ముగుస్తుంది.

వృషభ సంక్రాంతి ప్రాముఖ్యత 
1. వృషభ సంక్రాంతి రోజున సూర్యుడిని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సూర్య దోషం తొలగిపోతుంది.
2. సంక్రాంతి రోజున తలస్నానం చేసిన తర్వాత మీ పూర్వీకులకు తర్పణాలు వదలడం వల్ల మీరు వారిని ప్రసన్నం చేసుకోవచ్చు. 
3. పూర్వీకులకు క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది. 
4. వృషభ సంక్రాంతి రోజున సూర్య భగవానునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది.

Also Read: Budhaditya Rajayogam 2023: బుధాదిత్య రాజయోగంతో జూన్ 7 నుంచి ఆ 3 రాశులకు అష్ట ఐశ్వర్యాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News