Saturn Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..జాతకంలో శని గ్రహం శుభ స్థానంలో ఉంటేనే వ్యక్తుల జీవితాల్లో ఆనందం, సంతోషం రెట్టింపు అవుతుంది. జీవితాంతం రాజులా బ్రతక గలుగుతారు. అదే శని గ్రహం అశుభ స్థానంలో ఉంటే జీవితాంతం తీవ్ర సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ గ్రహం సంచారం చేసినప్పుడు కొందరి జీవితాల్లో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. శని నవంబర్‌ నెలలో రాశి సంచారం చేయబోతున్నాడు. నవంబర్ 4న శనిదేవుడు నేరుగా కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. దీని కారణంగా ఏయే రాశి ప్రభావితమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై శని చల్లని చూపు..
మేష రాశి:

శనిదేవుని ప్రత్యక్ష సంచారం మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీపావళికి ముందు అదృష్టం అనుకూలంగా మారబోతోంది. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన భవిష్యత్‌లో భారీ లాభాలు పొందుతారు. వ్యాపార రంగంలో విస్తరణతో పాటు సమాజంలో మంచి పేరును పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారు యజమాని నుంచి కూడా సులభంగా శుభవార్తలు వింటారు. అంతేకాకుండా శరీరం కూడా యాక్టివ్‌గా పని చేస్తుంది.


మిథున రాశి:
శని ప్రత్యక్ష సంచారం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధంలో కొనసాగుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారంలో మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇతరల నుంచి పొందాల్సిన డబ్బులు కూడా సులభంగా పొందుతారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి శని దేవుడి అనుగ్రహం లభించనుంది. ఈ సంచారం వీరికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారంలో మీ స్థానానికి సంబంధించి కొన్ని బాధ్యతలను పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుంది.ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు పొందుతారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి