Shani Dev effect on Zodiac Signs: గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శనిదేవుడు. ప్రస్తుతం శనిదవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మెుత్తం కుంభరాశిలోనే ఉంటాడు శని గ్రహం. కర్మఫలదాత అయిన శని గ్రహం మకర, కుంభరాశులకు అధిపతిగా భావిస్తారు. ఫిబ్రవరి నెలలో శని అధీనంలో ఉండే మకర రాశిలోకి కొన్ని పెద్ద గ్రహాలు సంచరించబోతున్నాయి. ఇదే రాశిలోకి సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ప్రవేశించబోతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల మీద ఆయా గ్రహాల శుభ ప్రభావం మాత్రమే కాదు శనిదేవుడు ఆశీస్సులు కూడా ఉండబోతున్నాయి. వీరికి రాబోయే ఆరు నెలలపాటు తిరుగుండదు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి
ఈరాశిలోనే అనేక గ్రహాల కలయిక జరగబోతుంది. దీంతో మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ మీకు వస్తుంది. లాటరీ, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉండబోతుంది. 
మీన రాశి
శనిదేవుడు ప్రభావం మీనరాశి వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. మీరు అన్ని కష్టాల నుండి బయటపడతారు. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. 
సింహం
మకరరాశిలో గ్రహాల సంచారం వల్ల సింహరాశి వారిని అదృష్టం వరించనుంది. మీకు పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. పాలిటిక్స్ లో ఉన్నవారు పదవి లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీరు మంచి పొజిషన్ కు వెళ్తారు. ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. 


Also Read: Venus Transits 2024: ఫిబ్రవరి 12న లక్ష్మీ నారాయణ యోగం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌ ప్రారంభం!


Also Read: Solar lunar eclipse 2024: 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహాణాలు.. ఇక నుంచి ఈ 5 రాశులకు అన్ని మంచి రోజులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి