Solar lunar eclipse 2024: 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహాణాలు.. ఇక నుంచి ఈ 5 రాశులకు అన్ని మంచి రోజులు..

Astrology 2024: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 08న, మెుదటి చంద్రగ్రహణం మార్చి 25న సంభవించబోతున్నాయి. రెండు గ్రహణాల కేవలం 15 రోజుల వ్యవధిలో రానుండటంతో.. కొందరికి అదృష్టం కలుగనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 05:03 PM IST
Solar lunar eclipse 2024: 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహాణాలు.. ఇక నుంచి ఈ 5 రాశులకు అన్ని మంచి రోజులు..

Solar and lunar eclipse 2024 dates: జ్యోతిష్య శాస్త్రం దృష్ట్యా గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హిందువులు గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 08న, మెుదటి చంద్రగ్రహణం మార్చి 25న సంభవించబోతున్నాయి. 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహరాశి: చంద్రగ్రహణం సింహరాశి వారికి అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. దీంతో ఫారిన్ వెళ్లాలన్న మీ కోరిక నెరవేరుతోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు లక్ కలిసి వస్తుంది. 
కన్య: సూర్య, చంద్ర గ్రహణాలు కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 
ధనుస్సు: సూర్య, చంద్ర గ్రహణాల వల్ల ధనుస్సు రాశి వారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. 
మేషరాశి: ఈ ఏడాది సంభవించబోయే సూర్య, చంద్రగ్రహణాలు మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
మిథున రాశి: గ్రహణాలు వల్ల మిథునరాశి వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతుంది. విద్య, ఉద్యోగం  వ్యాపారంలో మంచి ఫలితాలను చూస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

Also Read: Magh Amavasya 2024: ఇవాళ పవిత్రమైన యోగం.. ఈ 4 రాశులవారి కోరికలు నెరవేరడం పక్కా..

Also Read: Vasant Panchami 2024: వసంత పంచమికి ముందే సూర్యుడు-శని గ్రహాల కలయిక..ఈ రాశులవారికి పట్టింది బంగారామవ్వడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News