Shani in Dream: నిద్రపోతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కలలు వస్తాయి. కానీ, కొన్నిసార్లు నిద్రలో వచ్చిన కలలు మనకు కొన్ని గుర్తుకు వస్తాయి. ఆ కలలు ఏంటి.. వాటి అర్థం ఏమిటో రోజంతా మన మనస్సులో తిరుగుతూనే ఉంటాయి. మన కలలో వచ్చినవి నిజం అవుతాయా? అని చాలా మంది వాటి గురించి రోజంతా ఆలోచిస్తుంటారు. కానీ, కలలో కొన్నిసార్లు శనిదేవుడు వచ్చినట్లు చాలా మంది చెబుతారు. కానీ, శనిదేవుడు కలలో కనిపించడం మంచికా? చెడుకా? తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవునికి సంబంధించిన కలలు..


1) ఓ వ్యక్తి తన కలలో శని దేవుని విగ్రహం చూస్తే.. అది శుభంతో పాటు అశుభమని కూడా అర్థం. అయితే అది ఆ వ్యక్తి జాతకంలో శని స్థానాన్ని చూసిన తర్వాత ఈ విషయం చెప్పగలుగుతారు. 


2) శని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఈ కలను చూసినట్లయితే.. అతను త్వరలో ఆ వ్యాధిని వదిలించుకోబోతున్నాడని సూచన.


3) కలలో శనిదేవుని ఆలయాన్ని చూడటం కూడా శుభప్రదమే. అలా జరిగితే శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుందని అర్థం. ఆ కల వ్యక్తి అదృష్టంగా పరిగణిస్తారు. అలాంటి కల వస్తే ఆ వ్యక్తి లాభం పొందే అవకాశం ఉంది. 


4) అదే సమయంలో శని దేవుడి చిత్రం కలలో కనిపిస్తే.. అది కూడా శుభసూచికంగానే పరిగణిస్తారు. ఈ కల త్వరలో కొన్ని శుభవార్తలను పొందుతారని సూచిస్తుంది. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించినది. దీన్ని అనుసరించే ముందు సంబంధించిన జోతిష్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 


Also Read: Vastu Tips for Home: ఇంట్లో మట్టి కుండను ఆ దిశలో ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది...


Also Read: Solar Eclipse April 2022: సూర్యగ్రహణం రోజున చేయాల్సినవి, చేయకూడని పనులేంటి?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook