Vastu Tips for Home: ఇంట్లో మట్టి కుండను ఆ దిశలో ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది...

Vastu Tips for Home: వాస్తు శాస్త్రం ప్రకారం... ఇంట్లో ఉత్తర దిశలోనే మంటి కుండ లేదా కూజాను ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అది మీ ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 04:34 PM IST
  • గృహ వాస్తు టిప్స్
  • ప్రస్తుత వేసవి సీజన్‌లో ప్రతీ ఇంట్లో మట్టి కుండ ఉంటుంది
  • అయితే మట్టి కుండ ఏ దిశలో ఉంటే కలిసొస్తుందో తెలుసుకోండి
Vastu Tips for Home: ఇంట్లో మట్టి కుండను ఆ దిశలో ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది...

Vastu Tips for Home: వాస్తు శాస్త్రాన్ని పాటించడం ద్వారా ఆర్థికంగా, వ్యక్తిగతంగా సంతోషకర జీవితాన్ని గడపవచ్చునని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇల్లు, ఆఫీసు.. ఇలా ఏ చోటైనా వాస్తు అనేది ముఖ్యమని చెబుతారు. వాస్తు సరిగా కుదిరితే చేపట్టిన పనులు సకాలంలో పూర్తవడమే కాదు... వాటి ద్వారా కీర్తి ప్రతిష్ఠలు వస్తాయంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగడంలోనూ వాస్తు చాలా ముఖ్యమనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం వేసవి సీజన్ నడుస్తోంది. చాలామంది తమ ఇళ్లల్లో మట్టి కుండలు వాడుతారు. అయితే ఈ మట్టి కుండలను ఇంట్లో ఏ దిశలో ఉంచితే శుభం కలుగుతుందో తెలుసా...

మట్టి కుండ... వాస్తు దిశ :

వాస్తు శాస్త్రంలో కుండలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో మట్టి కుండలు ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కానీ ఆ కుండలను సరైన చోట ఉంచితేనే లక్ష్మీ దేవీ అక్కడ కొలువుంటుంది. కింద సూచించిన నియమాలను పాటిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడంతో పాటు దేనికీ లోటు ఉండదు.

ఉత్తర దిశలో ఉంచితే శుభం :

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిశలో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఉత్తర దిశలో మట్టి కుండను ఉంచాలి. అది అదృష్టాన్ని తీసుకొస్తుంది.

ఉత్తర దిశలో మట్టి కుండను ఖాళీగా ఉంచకూడదని గుర్తుంచుకోండి. కుండలో నీరు అయిపోతే వెంటనే దాన్ని నీటితో నింపాలి. ఖాళీ కుండ మీ అదృష్టానికి భంగం కలిగిస్తుంది. 

ఇంట్లో ఎప్పుడూ ఖాళీ కుండ లేదా కూజా ఉంచవద్దు. అది మిమ్మల్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయవచ్చు.

మీరు ఆర్థికంగా త్వరగా ఎదగాలనుకుంటే... ప్రతి రోజూ సాయంత్రం తులసి మొక్క దగ్గర మట్టి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో తిండి గింజలకు లోటు ఉండదు.

వంటగదిలో ఒక కుండ లేదా కూజా ఉంచినట్లయితే, దానిని స్టవ్ నుండి దూరంగా ఉంచాలి. అగ్ని, నీరు పక్క పక్కన ఉండకూడదు. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Malladi Vishnu: హైదరాబాద్‌కి కల్చర్ నేర్పిందే మేము... కేటీఆర్ కామెంట్స్‌పై మల్లాది విష్ణు కౌంటర్... 

Also Read; Mobile Charging Tips: మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ 5 తప్పులు చేయకండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News