Shani Margi 2022: అక్టోబర్ 23 నుండి గమనంలోకి శనిదేవుడు.. ఈ 5 రాశులవారికి మంచి రోజులు మెుదలు..
Shani Margi 2022: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. త్వరలో శని గమనంలోకి రానున్నాడు. శని సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Shani Margi 2022 effect: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడిగా భావిస్తారు. మీరు చేసిన పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు. ప్రస్తుతం మకరరాశిలో శనిగ్రహం తిరోగమనంలో ఉంది. అక్టోబరు 23 శుక్రవారం నాడు శనిగ్రహం గమనంలోకి (Shani Margi 2022) వస్తుంది. శనిదేవుడి ప్రత్యక్ష కదలిక వల్ల ఈ రాశులవారికి మంచి రోజులు రానున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం (Aries)- శని మేషంలోని పదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని వల్ల వ్యాపారులు భారీగా లాభపడనున్నారు. ఉద్యోగం మారాలనుకునేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది.
కర్కాటకం (Cancer)- కర్కాటక రాశిలోని ఏడవ ఇంటిలో శని సంచరిస్తాడు. దీంతో మీ లైఫ్ లోని సమస్యలన్నీ తొలగిపోతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది.
తులారాశి (Libra)- శని తులారాశి నాల్గవ ఇంటిలో సంచరిస్తాడు. ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగమిస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చికం (Scorpio)- ఈ రాశి వారికి కూడా శని మార్గం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఏదైనా పనిని మెుదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీన రాశి (Pisces)- శని గమనం వల్ల మీనరాశి వారి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
Also Read: Lucky Gemstone: కర్కాటక రాశి వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే.. అద్భుతమైన కెరీర్, అంతులేని ధనం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook