Lucky Gemstone: కర్కాటక రాశి వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే.. అద్భుతమైన కెరీర్, అంతులేని ధనం..!

Lucky Gemstone: మనం చేతికి రకరకాల ఉంగరాలు ధరిస్తాం. కొందరు గ్రహ దోషాలు పోవడానికి, మరికొందరు వారి స్టేటస్ ను తెలియజేయడానికి, ఇంకొందరు క్యాజువల్ గా ఈ రింగ్స్ ను ధరిస్తారు. అయితే కర్కాటక రాశివారు ఏ ఉంగరం ధరిస్తే బాగుంటుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2022, 09:43 AM IST
Lucky Gemstone: కర్కాటక రాశి వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే.. అద్భుతమైన కెరీర్, అంతులేని ధనం..!

Lucky Gemstone For Cancer: మనలో చాలా మంది చేతికి ఉంగరాలు ధరిస్తారు. వజ్రం, బంగారం, కెంపు, ముత్యం.. ఇలా రకరకాల ఉంగరాలు ధరిస్తారు. వారి వారి స్థోమతను బట్టి వీటిని ధరించడం జరుగుతుంది. కొంత మంది జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం రింగ్ ను ధరిస్తారు. ఆస్ట్రాలజీలో వివిధ రత్నాలు గురించి చెప్పబడ్డాయి. రాశి, గ్రహ స్థితి ఆధారంగా రత్నాన్ని ధరిస్తే మేలు జరుగుతుందని అంటారు. ప్రతి వ్యక్తికి ప్రతి రత్నం శుభప్రదం కాదు. జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని ధరించాలి. కర్కాటక రాశి (Cancer) వారికి ఏ రత్నం ధరిస్తే శుభప్రదంగా ఉంటుందో ఇవాళ తెలుసుకుందాం. 

మనలో చాలా మంది గ్రహ దోషాలు తొలగిపోవడానికి, జాతకంలో గ్రహాల బలపడటానికి ఈ రత్నాలు ధరిస్తారు. కర్కాటకరాశి చంద్రుడిచే పాలించబడుతుంది. ఇది నీటి మూలకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని డామినెంట్ రాశిచక్రం అంటారు. అందుకే కర్కాటక రాశివారు ముత్యం (Pearl) ధరించడం శ్రేయస్కరం. దీనిని ధరించడం వల్ల కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

ముత్యం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
>> ఆస్ట్రాలజీ ప్రకారం, కర్కాటకరాశివారు మెుండివారు, పైగా తెలివైన వారు. ముత్యం చల్లని  స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి ప్రజలు ముత్యం ధరిస్తే ముత్యం లాగే వారి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. 
>> కర్కాటక రాశి వారు ముత్యాల రత్నాలను ధరిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర సమస్య కూడా దూరమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి బలపడతుంది. దీంతోపాటు చంద్రదోషం నుండి విముక్తి లభిస్తుంది. 

ముత్యాన్ని ఎలా ధరించాలి?
>> రత్న శాస్త్రం ప్రకారం, ముత్యాలను వెండి ఉంగరంలో ధరిస్తారు. ఇది జూనియర్ వేలిలో ధరిస్తారు. ఏ మాసంలోనైనా శుక్ల పక్షం సోమవారం రాత్రి ముత్యాలను ధరిస్తారు. పౌర్ణమి రోజున ముత్యాలను ధరించడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 
>> ముత్యాన్ని ధరించే ముందు దానిని గంగాజలంలో కడిగి శుద్ధి చేసి శివునికి సమర్పించాలి. అలాగే, ముత్యంతో పాటు మరే ఇతర రత్నాన్ని ధరించకూడదని గుర్తుంచుకోండి. పుష్యరాగం మరియు పగడపు రత్నాలను మాత్రమే దీనితో ధరించవచ్చు.

Also Read: Surya Gochar 2022: రేపు రాశి మారబోతున్న సూర్యుడు.. ఈ 4 రాశులవారికి జాక్ పాట్.. మీరున్నారా మరీ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News