Saturn-Venus Conjunction in Kumbh 2024: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో సంయోగం జరుపుతాయి. 30 ఏళ్ల తర్వాత 2024లో రెండు పెద్ద గ్రహాల కలయిక సంభవించబోతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో శుక్రుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. అప్పటికే అదే  రాశిలో శనిదేవుడు ఉంటాడు. కుంభరాశిలో శుక్రుడు, శని గ్రహాల మైత్రి సుమారు 30 ఏళ్ల తర్వాత ఏర్పడబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక మేషం సహా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini)
గ్రహాల సంయోగం వల్ల మిథునరాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు. మీ సంపద పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు భారీగా లాభాలను ఇస్తాయి. మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. 
సింహం (leo)
సింహ రాశి వారికి గ్రహాల మైత్రి చాలా లాభాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం డబల్ అవుతుంది. మీరు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
మేషం(Aries)
కొత్త ఏడాదిలో కుంభరాశిలో శుక్రుడు మరియు శని కలయిక మేషరాశి వారికి అన్ని పనుల్లోనూ విజయాన్ని ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగులకు శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కల నెరవేరుతుంది. 


Also Read: Mangal Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం


వృషభం(Taurus)
శని, శుక్రుల సంచారం వృషభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతోంది. బిజినెస్ విస్తరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురోగాలు పెరుగుతాయి. 


Also Read: Shani Gochar 2024: వచ్చే ఏడాది శని గమనంలో పెను మార్పులు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి