Shani Gochar 2024: వచ్చే ఏడాది శని గమనంలో పెను మార్పులు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

Shani Uday 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. 2024లో శని గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మూడు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2023, 11:42 AM IST
Shani Gochar 2024: వచ్చే ఏడాది శని గమనంలో పెను మార్పులు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..

Shani Grah Gochar in 2024:  పురాణాల ప్రకారం, సూర్యదేవుడు కుమారుడు శనిదేవుడు. ప్రజలను శనీశ్వరుడు పీడిస్తాడని ఓ నమ్మకం ఉంది. అయితే ఇతడు తప్పుడు పనులు చేస్తేనే శిక్షించడం జరుగుతుంది. అందుకే శనిదేవుని న్యాయదేవుడు అని పిలుస్తారు. ఇతడి గమనంలోని మార్పు మెుత్తం 12 రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తోంది. వచ్చే ఏడాది శని స్థానంలో మూడు ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ముందుగా శని గ్రహం ఫిబ్రవరి 11న కుంభరాశిలో అస్తమించబోతోంది. ఆ తర్వాత మార్చి 18న శనిగ్రహం కుంభరాశిలో ఉదయిస్తుంది. మరల శనిదేవుడు జూన్ 29న అదే రాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని స్థానంలో మార్పులు 2024లో మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలు అందించబోతుంది. 

కుంభం: న్యూ ఇయర్ లో ఇదే రాశిలో శనిదేవుడు అస్తమించడం, ఉదయించడం మరియు తిరోగమనం చెందడం జరుగుతోంది. శని గ్రహ మార్పులు కుంభరాశి వారికి ఎన్నో లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు పెద్ద పొజిషన్స్ లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
వృషభం: 2024లో శనిదేవుడి సంచారంలో మార్పులు వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలు ఇస్తుంది. ఈ వ్యక్తులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసే వారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ డబ్బు కష్టాలు తీరిపోతాయి. మీ బ్యాంక్ బ్యాలెస్స్ అమాంతం పెరుగుతుంది. వ్యాపారస్తులు లాభపడతారు.

Also Read: 2024 To 2025 Rasi Phalalu: 2024 రాశి ఫలాలు..రాబోయే సంవత్సరంలో మోస్ట్ లక్కీ రాశుల వారు వీరే..

సింహం: కొత్త సంవత్సరంలో శని గ్రహ కదలికలు సింహరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కొత్త పనులు లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు అన్ని కష్టాల నుండి బయటపడతారు. శని అనుగ్రహంతో మీరు భారీ మెుత్తంలో డబ్బును పొందుతారు. 

Also Read: Lord Shiva Fav Zodiacs: 2024లో ఈ 3 రాశులకు శివుడి అనుగ్రహం.. ఇక వీరికి తిరుగుండదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News