Shani Vakri 2023 Effects on Zodiac Signs: మరో 8 రోజుల్లో అంటే జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. ఇదే స్థితిలో నవంబర్ 04 వరకు ఉండనున్నాడు. నవంబర్ 4వ తేదీ ఉదయం 8:26 గంటలకు శని ప్రత్యక్ష కదలిక మెుదలుకానుంది. శని వ్యతిరేక కదలిక ఐదు రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని తిరోగమనం ఈ రాశులకు నష్టదాయకం
మేషం- శని తిరోగమన సమయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తే అవకాశం ఉంది. 
వృషభం - శని వ్యతిరేక కదలిక వృషభ రాశికి అస్సలు కలిసిరాదు. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయం కాదు. రాబోయే 139 రోజులు మీరు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి- శని వక్రీ సమయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితం సమస్యలమయం అవుతుంది. మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. 


Also Read: Yogini Ekadashi 2023: జూన్ 14 నుండి ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?


తులారాశి- శని రివర్స్ కదలిక తులా రాశి వారికి కష్టాలను పెంచుతుంది. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. వ్యాపారం చేసే వారు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అందుకే ఈ సమయంలో తులరాశి వారు చాలా కేర్ పుల్ గా ఉండాలి 
కుంభం- కుంభ రాశి వారికి శని తిరోగమనం ప్రతికూలంగా ఉంటుంది. మీరు శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. 


Also Read:  Shani Dev: శనివారం ఉదయం ఈ దృశ్యాలు కనిపిస్తే.. మీపై శనిదేవుడి ఆశీస్సులు ఉన్నట్లే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook