Sravana Masam 2023 Rasi Phalalu: ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 4న ప్రారంభమై.. ఆగస్టు 31 వరకు ఉంటుంది. ఈ సారి ఇది 58 రోజులపాటు ఉండనుంది. ఇటువంటి అరుదైన యాదృచ్ఛికం 19 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. శివుని అనుగ్రహం పొందడానికి ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో కొన్ని రాశులకు భోలేనాథ్ ప్రత్యేక ఆశీర్వాదాలను ఇవ్వనున్నాడు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:


శ్రావణ మాసం మేషరాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. శివుడి అనుగ్రహంతో వీరు ఏ పని చేపడితే దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. 


మిథునం:


భోలేనాథ్ ఆశీస్సులు మిథునరాశి వారికి ఉంటాయి. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆదాయం డబల్ అవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 


సింహ రాశి:


సింహ రాశి ఉన్నవారు శ్రావణంలో చాలా ప్రయోజనాలను పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. ఆఫీసులో సహచరుల సపోర్టులభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 


Also Read: Venus transit 2023: సింహరాశి ప్రవేశం చేయనున్న రాక్షసుల గురువు.. ఈ 4 రాశులకు తిరుగులేదు..


వృశ్చిక రాశి:


ఈ రెండు నెలల శ్రావణ మాస కాలం వృశ్చిక రాశి వారికి కలిసిరానుంది. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. పెట్టుబడికి ఇదే మంచి సమయం. మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. 


ధనుస్సు:


శ్రావణ మాసం ధనస్సు రాశి వారికి మేలు చేయనుంది. ఈ సమయంలో జరిగే కొన్ని సంఘటనలు ధనుస్సు రాశి వారికి అనేక ప్రయోజనాలను ఇస్తాయి. మీకు కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీరు పోటీపరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. 


Also Read: Sun Transit 2023: జూలై 17 వరకు మిథునరాశిలోనే సూర్యుడు.. ఈ 3 రాశులవారి ఇళ్ల నిండా డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి