Shukra Grah will enter in LEO on 07th July 2023 Effect: గ్రహాల కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఇది వ్యక్తి జీవితంపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపనుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలై 07న సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం


వృషభం
వృషభ రాశి వారికి శుక్రుని సంచారం శుభ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. మీరు ఆర్థికంగా లాభాలను గడిస్తారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


కుంభ రాశి
శుక్రుని సంచారం కుంభ రాశి వారి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also Read: Planet Vakri 2023: ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. రాబోయే 6 నెలలు వీరికి నరకమే..!


తులారాశి
శుక్రుని సంచారం తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ఈ సమయంలో మీరు చర్చలకు దూరంగా ఉండండి. 


Also Read: Shani Retrograde 2023: రాబోయే 140 రోజులపాటు ఈ 5 రాశులకు డబ్బే డబ్బు... మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి