Dont Watch Soalar Eclipse Directly: దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సూర్యగ్రహణం ఇప్పటికే ప్రారంభమైంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గ్రహణం ప్రభావం మొదలైంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో సాయంత్రం నాలుగు గంటల 59 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభం అయింది. ఇక ఏపీలోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో సాయంత్రం 5 గంటల నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది ఇలా మన దేశవ్యాప్తంగా పలు 1 నిముషాలకు ప్రారంభమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేరువేరు సమయాలలో ఈ గ్రహణం ప్రారంభమైంది. అయితే మొత్తం మీద ఆరు గంటల 26 నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఈశాన్య ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఈ సూర్యగ్రహణం అయితే కొనసాగుతోంది కానీ ఈ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడుని నేరుగా చూడవద్దని హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.


ఒకవేళ సూర్యుడిని నేరుగా చూస్తే సైంటిఫికల్గా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. అలా చూస్తే కనుక కంటి రెటీనా దెబ్బతిని కంటికి ప్రమాదం కలిగే అవకాశం ఉందని కుమార్ హెచ్చరించారు. ఏదైనా బ్లాక్ ఫిలిం లేదా బ్లాక్ పాలిమర్, సోలార్ ఫిల్టర్, వెల్డింగ్ గ్లాస్, ఫ్లాపీ డిస్క్ వంటి వాటి ద్వారా మాత్రమే సూర్యుడిని చూడాలని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.


ఈ సూర్యగ్రహణం తులారాశిలో స్వాతి నక్షత్రంలో సంభవిస్తున్న నేపథ్యంలో స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు ఈ సూర్యగ్రహణాన్ని చూడకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు, అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది అందుకే దీనిని వార్షిక సూర్యగ్రహణం అని కూడా అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అటువంటి గ్రహణంలో, సూర్యుడికి మరియు భూమికి మధ్య దూరం ఎక్కువ అవుతుందని, సూర్యుని కాంతి భూమికి చేరుకోవడానికి ముందు చంద్రుడు మధ్యలో వస్తాడని ఆ  కారణంగా సూర్యునిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుందని అంటూ ఉంటారు. 


Also Read: 18 Pages - Dhamaka: సీనియర్ రవితేజతో జూనియర్ రవితేజ పోటీ.. రచ్చ మామూలుగా లేదుగా!


Also Read: Ram Setu Telugu Movie Review : రామ్ సేతు రివ్యూ.. తెలియని విశేషాలెన్నో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook