Ram Setu Telugu Movie Review : రామ్ సేతు రివ్యూ.. తెలియని విశేషాలెన్నో

Akshay Kumar Ram Setu అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు మూవీని అన్ని భాషల్లో విడుదల్లో చేశారు. తాజాగా ఈ మూవీని తెలుగు వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 08:04 PM IST
  • నేడే రామ్ సేతు సినిమా
  • అక్షయ్ కుమార్ కొత్త సినిమా
  • తెలియని వింతలు, విశేషాలెన్నో
Ram Setu Telugu Movie Review : రామ్ సేతు రివ్యూ.. తెలియని విశేషాలెన్నో

Ram Setu Telugu Movie Review: రామసేతు మీద భారతదేశంలో జరిగే చర్చలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దాని మీద నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. శ్రీరాముడు కట్టినది కాబట్టి.. దానికి రామసేతు అనే పేరు వచ్చిందని మన దేశ ప్రజల నమ్మకం. కానీ కొంత మంది మాత్రం దాన్ని నమ్మరు. రామసేతు అంటే రాముడు కట్టించింది కాదని వితండవాదం చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సినిమా. మరి ఈ రామసేతులో ఎటువంటి కొత్త విషయాలు బయటకు వచ్చాయి.. ఎటువంటి విశేషాలు చూపించారో ఓసారి రివ్యూలో చూద్దాం.

కథ
రామ సేతుని పడగొట్టి వ్యాపారం చేయాలని ఇంద్రకాంత్ (నాజర్) అనుకుంటాడు. ప్రజలకు వ్యతిరేకించడం, కోర్టు కేసులు వచ్చి పడుతుంటాయి. దీనికి నాస్తికుడైన పురావస్తు శాస్త్రవేత్త అయిన ఆర్యన్ (అక్షయ్ కుమార్) ఓ రిపోర్ట్ ఇస్తాడు. రామ సేతు కట్టడం అనేది.. సహజ సిద్దంగా ఏర్పడిందని, రామాయణం ఓ కావ్యం మాత్రమేనని రిపోర్ట్ ఇస్తాడు. దీంతో ఆర్యన్‌కు లేనిపోని చిక్కులు వస్తాయి. ఉద్యోగం నుంచి తీసివేస్తుంది ప్రభుత్వం. కానీ ఇంద్రకాంత్ 
మాత్రం రామసేతు మీద పరిశోధించేందుకు ఆర్యన్‌ను నియమిస్తాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌ తెలుసుకున్న సత్యాలేంటి? విశిష్టమైన ఏళ్ల నాటి రామసేతుని చూసిన ఆర్యన్ ఏం చేస్తాడు? శ్రీలంకకు ఆర్యన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాముడిని ఆనవాళ్లు వెతుక్కుంటూ వెళ్లిన ఆర్యన్‌కు రావణాసురుడి ఆనవాళ్లు ఎందుకు వెతకాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన ఏపి (సత్యదేవ్) పాత్ర ఏంటి? చివరకు రామసేతు మీద ఆర్యన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అనేది కథ.

రామ సేతు కథ అందరికీ తెలిసిందే. రామ సేతుని పడగొట్టేందుకు అప్పటి ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. అయితే ఇప్పుడు ఈ కథను తెర మీదకు తీసుకొచ్చారు. అసలు రామసేతు వెనుకున్న రహస్యాలు ఏంటి? రామ సేతుని రాముడి కట్టించాడు అని చెప్పడానికి ఉన్న ఆధారాలేంటి?.. శ్రీలంకలోనూ రావణాసురుడి ఆనవాళ్లున్నాయి.. అంటే మన దేశంలో రాముడి ఆనవాళ్లు ఉన్నట్టే కదా? అనే లాజిక్‌తో ఈ సినిమా నడుస్తుంది. రాముడే రామసేతు కట్టించాడని చెప్పడం, దానికి ఆనవాళ్లు వెతుక్కుంటూ వెళ్లిన హీరోకి చిక్కులు ఏర్పడుతుంటాయి. శ్రీలంకకు చేరుకున్న హీరో.. అక్కడ రావణాసురుడి ఆనవాళ్లను చూపిస్తే.. రాముడు కూడా ఉన్నట్టే కదా? అని తన ప్రయాణం మొదలుపెడతాడు.

అలా శ్రీలంకలోని త్రికూటపర్వతం, అశోకవనం ఇలా అన్నింటిని చూపించుకుంటూ వెళ్లారు. రావణాసురుడి స్వర్ణ లంక, అందులోకి వెళ్లే రహస్య మార్గం ఇలా అన్నింటిని ఇందులో చూపించారు. ఇక సముద్రంలో ఉన్న రామసేతుని చూపించే విజువల్స్ అందరినీ మెప్పిస్తాయి. చివరకు సంజీవని లాంటి మొక్కలు కూడా త్రికూటపర్వతం వద్ద లభిస్తాయి. వీటన్నంటితో రాముడు, రావణుడు, రామసేతుని కోర్టులో నిరూపించేందుకు ప్రయత్నిస్తాడు హీరో.

అయితే ఇందులో హీరో ప్రయాణం కాస్త గజిబిజిగా అనిపించినా చివర్లో చెప్పే మాటలు, కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం మెప్పిస్తాయి. కుతుబ్ మినార్, తాజ్ మహల్ వంటి వాటిని మనం పరిరక్షిస్తున్నాం.. మన దేశ సంపద, సంస్కృతిని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది.. రాముడికి ఎన్నో గుడులున్నాయి. కానీ రామసేతు మాత్రం ఒక్కటే ఉంది.. దాన్ని కాపాడుకుందాం అని హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఇక కోర్టు చివర్లో ఇచ్చిన తీర్పు కూడా మెప్పిస్తుంది.

రాముడు ఉన్నాడా? లేడా? రామసేతు కట్టించాడా? లేడా? అని వస్తే.. అది నమ్మని వారే వాటిని ఫ్రూవ్ చేయాలి.. నమ్మేవారి పని కాదు.. వారు ఎప్పటి వరకు అయితే రాముడే రామసేతు కట్టించలేని ఫ్రూవ్ చేయరో.. అప్పటి వరకు రామసేతుని కూల్చేయడానికి వీల్లేదని కోర్టు తీర్పునిస్తుంది. ఇలా కథ ముందుకు సాగుతుంది. అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. హీరోకు ఈ ప్రయాణంలో తోడుగా నిల్చిన వ్యక్తి ఎవరో రివీల్ చేసే సీన్ బాగుంటుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి.

Also Read :  Nayanthara Twin Babies : పిల్లల్ని ఎత్తుకున్న నయన్ విఘ్నేశ్ జోడి..స్పెషల్ వీడియో

Also Read : Puri Jagannadh Audio Leak : లైగర్ దెబ్బ మామూలుగా లేదు.. డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్!.. పూరి ఆడియో లీక్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News