Sun Eclipse after 27 years on Diwali 2022: హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టపడే దీపావళి రానే వచ్చేసింది. దీపాల కాంతుల మధ్య దేశం కళకళలాడేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకోనున్నారు. అంతకుముందు 27 సంవత్సరాల క్రితం.. 1995లో దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఈ ఏడాది  దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2022 సంవత్సరంలో రెండో, చివరి సూర్యగ్రహణం అవుతుంది. అయితే అమావాస్య ముగిసిన తర్వాత ఈ గ్రహణం ఏర్పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తీక మాసం అమావాస్య ముగిసిన తర్వాత ఏర్పడే ఈ సూర్యగ్రహణం చాలా విశిష్టమైనది. ఇది వివిధ రాశుల్లో పుట్టిన వ్యక్తులపై అనేక రకాలుగా ప్రభావం చూపనుంది. అందులో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ముందుగా తెలుసుకుంటే.. ఆయా రాశుల్లో పుట్టిన వ్యక్తులకు ఉపయోగంగా ఉంటుంది. చెడు ప్రభావం నుంచి బయటపడ్డానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇలాంటి విషయాలపై ముందే అవగాహన ఉండడం చాలా అవసరం. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను అప్రమత్తం చేయవచ్చు. 


ఏ రాశి వారిపై ఎటువంటి ప్రభావం:
మేషం:
మేషరాశిలో పుట్టిన వారిపై సూర్య గ్రహణం ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. ముఖ్యంగా వారి వైవాహిక జీవితంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఈ రాశి వాళ్లు వీలైనంత వరకు ఆలోచనలను, మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలామంచింది. 


వృషభం:
వృషభ రాశిలో పుట్టిన వారిపై ఈ సూర్య గ్రహణ ప్రభావం చాలా అనుకూలంగా  ఉండనుంది. ఈ రాశి వాళ్లు ఎటువంటి భయభ్రాంతులకు గురికానక్కర్లేదు. పైగా వారి జీవితంలో ఆనందం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశివాళ్లు సూర్య గ్రహణం ప్రభావం తమపై ఎలా ఉంటుందోననే ఆందోళనకు గురికానక్కర్లేదు. సంతోషంగా ఉండవచ్చు. 


మిథునం: 
ఈ రాశిలో పుట్టిన వాళ్లకి సూర్యగ్రహణం ప్రభావం ప్రతికూలంగా ఉండనుంది. ఈ రాశి వాళ్లు మానసిక సమస్యలకు, ఒత్తిడికి గురికానున్నారు. అందుకే ఆ సమయంలో వీలైనంత వరకు అతిగా ఆలోచించడాన్ని అదుపు చేసుకోవడం అవసరం. 


కర్కాటకం:
ఈ రాశివాళ్లపై కూడా గ్రహణం ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. వీరంతా చాలా అప్రమత్తంగా ఉండడం అవసరం. ఈ విషయం వారికి కొంచెం బాధాకరంగానే ఉండొచ్చు. కానీ ఈ విషయాన్ని గ్రహించి అప్రమత్తంగానే ఉండడం మంచిది. 


సింహం:
ఈ రాశి గల వ్యక్తులు ఏ మాత్రం ఆందోళన చెందనవసరం లేదు. వీరి గ్రహణం ప్రభావం చాలా తక్కువగా ఉండనుంది. అయితే ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంది. అంటే ఈ రాశి వాళ్లకు సూర్య గ్రహణం కలసి రానుంది. 


కన్య:
కన్య రాశి వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యగ్రహణ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండనుంది. పైగా వీరు డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ గ్రహణ ప్రభావం ఉన్నరోజు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటే మేలు. 


తుల:
తులరాశి గల వాళ్లపై గ్రహణం ప్రభావం ప్రతికూలంగా ఉండనుంది. అందుకే వీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. 


వృశ్చికం:
రాశుల వారు కూడా ఈ సూర్యగ్రహణం నుంచి మత్తంగా ఉండాలి. మీరు డబ్బుకు సంబంధించి కొంత నష్టాన్ని చవిచూడవచ్చు. అందుకే ఆ గ్రహణం రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాలి. 


ధనుస్సు:
ధనుస్సు రాశిలో పుట్టిన వారి ఈ సూర్య గ్రహణం మేలు చేయనుంది. ఆ రోజున వాళ్లు మంచి వార్త వినే అవకాశం ఉంది. గ్రహణం ప్రభావంతో వారు త్వరలో గొప్ప వార్తలను వినవచ్చు. 


మకరం:
సూర్యగ్రహణ ప్రభావం మకరరాశి వాళ్లపై అనుకూలగానే ఉండనుంది. వీళ్లు ఎటువంటి భయాందోళనకు గురికానక్కర్లేదు. చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల శుభవార్త వినే అవకాశం ఉంది. త్వరలో కొన్ని పెద్ద ప్రయోజనాలను కూడా పొందబోతున్నారు. 


కుంభం:
ఈ రాశివారిపై గ్రహణ ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉండనుంది. వీరి గౌరవం దెబ్బతింటుంది. కాబట్టి వీరు ఏ పని చేసినా.. ఏం మాట్లాడినా.. బాగా ఆలోచించి చేయాలి. లేదంటే ఊహించని అనుభవాలు  ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


మీనం:
సూర్యగ్రహణం మీన రాశి వారికి ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈ రాశి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బాధపడే అనుభవాలు ఎదురవుతాయి. 


Also Read: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే రెండు జట్లు అవే.. సునీల్ గవాస్కర్ జోస్యం!


Also Read: రాసిపెట్టుకోండి.. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌ను భారత్ ఓడిస్తుంది: సచిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook