Sun Transit September 2022 : సూర్యభగవానుడు మరో రెండు రోజుల్లో కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. నెల రోజులపాటు సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలమైన స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఎవరి కుండలిలో అయితే సూర్యుడు అశుభస్థానంలో ఉంటాడో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.  అంతేకాకుండా కన్యారాశిలో సూర్య, బుధల సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కన్యారాశిలో సూర్యుడు సంచారం ఏ రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై సూర్యభగవానుడు ప్రతికూల ప్రభావం 
వృషభరాశి (Taurus): సూర్య సంచారం వృషభరాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు మానసికంగా కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కోంటారు. ఎటువంటి కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో గొడవలు రావచ్చు. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.


తులారాశి (Libra): కన్యాసంక్రాంతి సమయంలో మీరు కుటుంబానికి దూరంగా ఉండవల్సి ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది.  శత్రువులు మీపై విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. మీత్రులతో మీకు గొడవలు రావచ్చు. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. 


మకరరాశి (Capricorn): సూర్య సంచారం కారణంగా ఈ రాశివారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోంటారు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలగవచ్చు. ఈ సమయంలో మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ తండ్రితో వాగ్వాదం జరుగవచ్చు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 


కుంభరాశి (Aquarius) : ఈ రాశివారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమయంలో తెలివిగా వ్యవహారించండి. ఎవరితోనూ వాగ్వాదాలను దిగకండి.  ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 


మీనరాశి (Pisces): ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ కాలం చాలా అననుకూలంగా ఉంటుంది. మీ పనిలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. మీకు కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. 


Also Read: Budhaditya Rajyog: ఈ రాశులవారికి రాజయోగం.. ఇక వీరు డబ్బే డబ్బు పొందుతారు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook