Surya rashi parivartan 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడు..శక్తి, గౌరవం, తండ్రి, అధికారానికి చిహ్నాంగా భావిస్తారు.  సూర్యుడు ప్రతి నెల రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు సెప్టెంబరు 17, 2022 శనివారం ఉదయం 7.11 గంటలకు తన సొంతరాశి అయిన సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి (Sun Transit in Virgo 2022) ప్రవేశించనున్నాడు. సూర్యుడు నెల రోజులపాటు కన్యారాశిలో ఉంటాడు. అనంతరం సూర్యుడు అక్టోబరు 17న తులరాశిలో సంచరిస్తాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహు-సూర్యుడు కలయికతో అశుభకరమైన యోగం..
పంచాంగం ప్రకారం, సూర్యుడు....బుధుడి రాశి అయిన కన్యారాశిలో సంచరించనప్పుడు.. అది మేషరాశిలో ఉన్న రాహువుతో అశుభకరమైన షడష్టక యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా ఒక పెద్ద నాయకుడు మరణించవచ్చు లేదా ప్రకృతి విపత్తులు ఏర్పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. 


షడష్టక యోగం కొన్ని రాశులవారికి వరం...
మేషం (Aries):  సూర్య సంచార ప్రభావం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి కలిసి వస్తుంది. మెుత్తం మీద ఈ సమయం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది.   
కర్కాటకం (Cancer): కన్యారాశిలో సూర్య సంచార ప్రభావం కారణంగా మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఆఫీసులో మీ కొలిగ్స్ సపోర్టు లభిస్తుంది.  
వృశ్చికం (Scorpio): సూర్యుడి రాశి మార్పు ఈ రాశివారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. అపారమైన డబ్బు సంపాదిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. 


Also Read: Shani Dosha Remedies: టీ తాగితే జాతకంలోని శనిదోషం పోతుందట. అదెలాగో తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook