surya grahan 2022 time: సూర్య గ్రహణం మరి కొద్దిరోజుల్లోనే ఉంది. ఇదే ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం. అక్టోబర్ 25వ తేదీన ఏర్పడనుంది. అది కూడా దీపావళి తరువాత రానుంది. సూర్య గ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య గ్రహణమనేది ఓ ఖగోళ సంఘటన. భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడేదే సూర్య గ్రహణం. ఈ ఏడాది ఏర్పడనున్న పాక్షిక సూర్య గ్రహణం ఐరోపా, యూరప్, పశ్చి మ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా ఈశాన్య ప్రాంతాల్లో కన్పిస్తుంది. ఇండియాలో అన్ని ప్రాంతాల్నించి వీక్షించే అవకాశముంది. 


జ్యోతిష్యశాస్త్ర నమ్మకాల ప్రకారం సూర్య గ్రహణం సమయంలో ఏ విధమైన పనులు చేయకూడదు. ముఖ్యంగా శుభ కార్యాలకు నిషేధముంది. అదే సమయంలో గర్భిణీ స్త్రీలపై చాలా ఆంక్షలుంటాయి. లేకపోతే పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుందని అంటారు.  గ్రహణ సమయంలో విశ్వంలో ప్రతికూల శక్తి ఒక్కసారిగా పెరుగుతుందని..ఇది గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని చెబుతారు. 


గ్రహణ సమయంలో ప్రతికూలతను నివారించేందుకు గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి మంత్రాలు జపించాలి. ఓం జపం చేయాలని చెబుతారు. సూర్య గ్రహణం సమయంలో పదునైన వస్తువుల్ని గర్భిణీ మహిళలు ఉపయయోగించకూడదు. ఇది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుందని. గ్రహణ సమయంలో వీలైనంతవరకూ ఏదీ తినకుండా ఉండాలి.


Also read: Shani Margi 2022: శని ప్రభావంతో పండగ ముందు ఈ రాశువారికి తీవ్ర నష్టాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook