Annaprasadam Donations: తిరుమలలో స్వామివారి దర్శనంతోనే కడుపు నిండుతోంది. అయినా కూడా తిరుమలలో ఆకలితో బాధపడకూడదని అడుగడునా భక్తులకు అన్నదానం అందిస్తుంటారు. వెంగమాంబ అన్నప్రసాదం సత్రంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భక్తులకు ఆహారం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నప్రసాద సత్రానికి భక్తుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం విరాళాలు ఆహ్వానిస్తోంది. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తుల కోసం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించారు. భక్తులకు విరాళం చెల్లించడంపై అవగాహన లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ క్రమంలో అన్నప్రసాదానికి విరాళం చెల్లించే వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Happy Diwali 2024: దీపావళి మీ బంధుమిత్రుల్ని ఇలా విష్ చేయండి


అన్నప్రసాద విరాళాల వివరాలు
లక్షలాది భక్తులకు టీటీడీ ప్రతి రోజు అన్నప్రసాదం వితరణ చేస్తుంది. తిరుమలతోపాటు తిరుపతిలో కూడా అన్నప్రసాదం ఉచితంగా అందిస్తుంటారు. తిరుమల, తిరుపతిలో కలిపి రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుంది. టీటీడీ లెక్కల ప్రకారం ఒకరోజు అన్న ప్రసాద వితరణకు రూ.44 లక్షలు ఖర్చు అవుతుంది. అంత మొత్తంలో డబ్బు చెల్లించిన భక్తులకు తిరుమలలో అనేక సదుపాయాలు, ప్రయోజనాలు దక్కుతాయి. అన్నప్రసాదం కేంద్రంలో దాతలు స్వయంగా వడ్డించే అవకాశం. ప్రతిచోట దాతల పేర్లు ప్రదర్శిస్తారు.

Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేత


అన్నప్రసాద వితరణ విరాళాల వివరాలు.


  • ఒకరోజు మొత్తం రూ.44 లక్షలు చెల్లించాలి

  • ఉదయం అల్పాహారం కోసమైతే రూ.10 లక్షలు

  • మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు

  • రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు


అన్నప్రసాదాలు విత‌ర‌ణ చేసే ప్రాంతాలు
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4 (పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి వారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం


టీ, కాఫీలు అందించే కేంద్రాలు
వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటి పిల్లలకు పాలు అందిస్తారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.