These 4 Zodiac Signs Will Have Miracles in Life in 2023 March due to Shani Uday 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం... శని దేవుడు చాలా ముఖ్యమైనది. శని గ్రహం అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదిలే గ్రహం. శని గ్రహం యొక్క రాశి మార్పు ప్రభావం అన్ని రాశుల వారి జీవితంపై ఉంటుంది. శనిని న్యాయ దేవుడు మరియు ఫలితాలను ఇచ్చే ప్రదాత అని కూడా అంటారు. శని దేవుడు ఒక వ్యక్తి యొక్క మంచి మరియు చెడు పనులకు సంబంధించిన లెక్కలను బట్టి తదనుగుణంగా ఫలాలను ఇస్తాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 జనవరి 31న కుంభ రాశిలో శని అస్తమించాడు. ఏదైనా గ్రహం అస్తమించినప్పుడు దాని ప్రతికూల ప్రభావం అన్ని రాశి చక్ర గుర్తుల స్థానికుల జీవితంపై ఉంటుంది. మార్చి 5న కుంభ రాశిలో శని పూర్తిగా ఉదయిస్తాడు. శని ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంటే శుభ ఫలితాలు ఉంటాయి. ఏయే రాశుల వారికి శని ఉదయం వల్ల శుభ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం ఉదయించడం వల్ల వృషభ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఈ రాశుల ప్రజలు విశేష ప్రయోజనాలను పొందుతారు. భవిష్యత్తు పురోగతికి అవకాశం ఉంది. ఏదైనా నిలిచిపోయిన పని కూడా ఈ సమయంలో పూర్తి చేయబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు సమాజంలో మీకు గౌరవం మరియు కీర్తి లభిస్తుంది.


కుంభ రాశి:
కుంభ రాశిలో శని ఉదయించబోతున్నాడు. దాంతో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. గతంలో నిలిచిన పనులు ఇపుడు ప్రారంభమవుతాయి. అంతేకాదు శనీ శ్వరుడు ఉదయించడం వల్ల ఈ రాశుల వారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యారంగంలో కూడా పురోగతి సాధించే అవకాశం ఉంది.


సింహ రాశి:
సింహ రాశి వారికి శని ఉదయించడం శుభసూచకం. శని ఉదయించడం వల్ల ఈ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. అంతేకాదు ఈ రాశుల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.


మీన రాశి:
మీన రాశి వారికి శని ఉదయించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. గత నెలలో ఇబ్బందులు పడిన వారికి మార్చి నెలలో మంచి రోజులు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారికీ ఆనందం మరియు శ్రేయస్సు పొందుతారు. ఈ కాలంలో శుభ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతేకాదు శాంతిని అనుభవించగలరు.


Also Read: బుసలు కొడుతున్న 20 అడుగుల కింగ్ కోబ్రా.. సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు! మెంటలెక్కించే వీడియో  


Also Read: Saturn Effect 2023: శని దేవుడి ప్రభావం.. ఈ రాశుల వారికి అనారోగ్య సమస్యలు! మందులు కూడా పని చేయవు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.