Ganga Dussehra 2022: గంగా దసరా రోజున గంగా మాత భూమికి దిగి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ గంగానదిలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం మంచిదని పెద్దల మాట. హిందూ ధర్మంలో గంగా దసరా పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిన జరుపుకుంటారు. ఈ పర్వదినాన గంగా మాత భూమికి వస్తుందని నమ్మకం. గంగా దసరా రోజున గంగా మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయి. ఇవాళ మొక్కును చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ గంగా నదిలో స్నానం చేయడం వల్ల వ్యక్తి యొక్క 10 రకాల పాపాలు పోతాయని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇవాళ గంగా స్నానం చేయాలని అంటున్నారు. 2022లో గంగా దసరాకు ప్రత్యేక గుర్తింపు ఉందని..ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు చేయాలంటున్నారు. అందుకే చాలా చోట్ల ఇవాళ మహా లక్ష్మీ యోగం, గజకేసరి సోగ్, బుధాదిత్య యోగం, రవి యోగం చేస్తున్నారు. ఇవాళ శుభ ముహూర్తం ఉదయం 7.07 గంటలకు మొదలైంది. ఈ మూహుర్తం రేపు ఉదయం 08.23 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. 


గంగా దసరా నాడు వస్తువులను దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల వారిలోని అన్ని లోపాలు తొలగిపోతాయి. గంగా దసరా రోజున నీరు, ఆహారం, పండ్లు, దుస్తులు, పూజలు,మేకప్ మెటీరియల్స్, నెయ్యి, ఉప్పు, పంచదార దానం చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి.


Also read:China Plane Crash: చైనాలో కుప్పకూలిన మరో విమానం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు...


Also read:Bandi Sanjay: రైతు బంధు ఎప్పుడిస్తావ్ కేసీఆర్.. బండి సంజయ్ బహిరంగ లేఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook