జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నిర్ణీత సమయంలో గ్రహాల గోచారంతో అన్ని రాశుల జీవితంపై ప్రభావం పడుతుంది. శనిగ్రహం ప్రస్తుతం తన కుంభరాశిలోనే ఉన్నాడు. 2025 వరకూ ఉండనున్నాడు. త్రిగ్రహ యోగంతో ముఖ్యంగా మూడు రాశులపై ప్రభావం పడనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి నెలలో సూర్య, బుధ గ్రహాల గోచారం కుంభరాశిలో జరగడం వల్ల కుంభరాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా పడుతుంది. అదే సమయంలో 3 రాశులకు అద్భుతమైన ధనలాభం కలగనుంది. పదోన్నతి కలుగుతుంది. 


మిథున రాశి


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరిలో కుంభరాశిలో త్రిగ్రహ యోగం మిథునరాశి వారికి అత్యంత లాభదాయకం కానుంది. ఈ యోగం ఈ రాశిలోని 9వ పాదంలో ఉంటుంది. దీనిని అదృష్టానికి, విదేశీ యాత్రకు స్థానంగా భావిస్తారు. ఈ క్రమంలో మిథున రాశి జాతకులకు అదృష్టం కలగనుంది. ఈ సందర్భంగా విదేశీ యాత్రలు చేసే అవకాశం లభిస్తుంది. పని నిమిత్తం బయటకు వెళ్లే అవకాశముంటుంది. పోటీ పరీక్షలకు ఏర్పాట్లు చేసేవారికి అద్భుత అవకాశం. 


మేషరాశి


త్రిగ్రహ యోగం మేషరాశి వారికి శుభసూచకం కానుంది. ఈ క్రమంలో ఈ జాతకం వారికి మంచి రోజులు ప్రారంభమౌతాయి. ఈ యోగం ఈ రాశివారికి 11వ పాదంలో ఉంటుంది. ఆదాయం, లాభాలకు స్థానంగా భావిస్తారు. ఈ నేపధ్యంలో ఆదాయంలో వృద్ది ఉంటుంది. అటు వ్యాపారులకు ఈ సమయంలో మంచి లాభాలుంటాయి. వివిధ మార్గాల్నించి ఆదాయం సంపాదించే అవకాశాలుంటాయి. పెట్టుబడులతో ఈ సమయం లాభముంటుంది. ఉద్యోగార్ధులకు అనుకూలంగా ఉంటుంది. 


కన్యారాశి


త్రిగ్రహ యోగం ఈ రాశివారికి విశేష లాభముంటుంది. ఈ యోగం కన్యారాశి 6వ పాదంలో ఉంటుంది. దీనిని రోగాలు, శత్రువులకు స్థానంగా భావిస్తారు. ఈ క్రమంలో ఈ సమయంలో కోర్టు వ్యవహారాల్నించి విముక్తి లభిస్తుంది. ప్రత్యర్ధులకు విజయం లభిస్తుంది. ఈ సమయంలో ఏదైనా వాహనం లేదా ఆస్థులు కూడా కొనవచ్చు.


Also read: Vastu Tips: ఇంట్లో తరచూ అశాంతి, చికాకు వేధిస్తుంటే..ఈ చిట్కాలు పాటించండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook