Tusli plant tips: హిందూమతం ప్రకారం తులసి మొక్కకు ఆధ్యాత్మిక ప్రాశస్త్యత ఉంది. దాదాపుగా ప్రతి హైందవుని ఇంట్లో తులసి మొక్క విధిగా ఉంటుంది. ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసముంటుందని ప్రతీతి. నిర్ణీత రూపంలో తులసి మొక్కలు పూజలు చేయడం వల్ల ఆ ఇంట సుఖ శాంతులు కలుగుతాయని నమ్మకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి మొక్కకు రోజూ క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి సదా కొలవుదీరుతుందంటారు. లక్ష్మీదేవి ప్రసన్నమౌ కటాక్షం కురిపిస్తుందని ప్రతీతి. లక్ష్మీదేవి కటాక్షం కారణంగా ఆ ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయి. అయితే తులసి మొక్కను ఏ దిశలో అమర్చుకోవాలి, ఎలా పూజలు చేయాలనేది వాస్తు శాస్త్రంలో వివరంగా ఉంది. ఏ దిశలో పడితే ఆ దిశలో తులసి మొక్కను ఉంచకూడదు. సహజంగానే వాస్తు శాస్త్రమంటే దిశల్ని బట్టి ఉంటుంది. సరైన దిశలో ఉంటేనే ఏ వస్తువైనా పాజిటివ్ ఫలితాలనిస్తుందంటారు. తులసి మొక్క అనేది ఇంట్లో నెగెటివిటీని దూరం చేస్తుంది. అదే తులసి మొక్కను ఇంట్లో తప్పుడు దిశలో ఉంచితే ఆ ఇంట్లో సమస్యలు ఎదురౌతాయి. 


వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలో పొరపాటున కూడా అమర్చకూడదు. దీనివల్ల వాస్తుదోషం తలెత్తుతుంది. ఆ వ్యక్తి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. తులసి మొక్క నాటేందుకు ఇంటి నార్త్ ఈస్ట్ లేదా నార్త్ అనేది సరైన దిశగా వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంట్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలుంటే తొలగిపోతాయి. 


ఇంట్లో తులసి మొక్క పెంచుతుంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటారు వాస్తు నిపుణులు. ప్రత్యేకించి కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ఆర్ధికంగా పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆదివారం రోజున, ఏకాదశి రోజున పొరపాటు కూడా తులసి ఆకు తెంచకూడదు. సాయంత్రం తరువాత కూడా తులసి ఆకులు తెంపకూడదు. రాత్రి వేళ తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఒకవేళ ఈ సూచనల్ని ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి జీవితంలో ప్రతి అంశంలో ఆటంకాలు ఎదురౌతాయి. తులసి నియమాల్ని పాటించడం వల్ల ప్రతికూల పరిణామాల్నించి తప్పించుకోవచ్చు. అందుకే తులసి మొక్క విషయంలో వాస్తు సూచనలు తప్పకుండా పాటించాలి.


Also read: Rahu-Ketu Transit 2024: రాహు కేతువుల ప్రభావం, ఆ మూడు రాశులకు కొత్త ఏడాదిలో ఎలా ఉంటుందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook