Vastu Tips for Kitchen: వంటగది యొక్క ఈ 10 వాస్తు చిట్కాలు తెలుసుకోండి! మీ అదృష్ట రేఖను మార్చుకోండి..
Vastu Tips for Kitchen: మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వంటగదిని వాస్తు ప్రకారం నిర్మించాలి. కిచెన్ కోసం 10 వాస్తు చిట్కాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
Vastu Tips for Kitchen: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం చాలా ముఖ్యం. కాబట్టి వంటగదిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఈ రోజు కిచెన్ (Vastu Tips for Kitchen)కు సంబంధించి వాస్తు చిట్కాలు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం (Vastu Shastra) ప్రకారం, మన వంటగది ఆగ్నేయంలో అంటే అగ్ని కోణంలో ఉండాలి. అగ్నికి సంబంధించిన పనులు అగ్ని దిశలో జరుగుతాయి. ఈ దిశ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు మానసిక సమస్యలను తొలగిస్తుంది.
వంటగది కోసం 10 వాస్తు చిట్కాలు:-
>> వంటగది ఆగ్నేయంలో అంటే అగ్ని కోణంలో ఉండాలి.
>> వంటగదిలో కిటికీలు తూర్పు మరియు పడమర వైపు ఉండాలి.
>> వంటగది యొక్క ప్రధాన తలుపు మరియు ఇంటి ప్రధాన తలుపు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు.
>> వంటగదిలో వాష్ బేసిన్ మరియు నీరు ఈశాన్య దిశలో ఉంచాలి.
>> వంట చేసేటప్పుడు, గృహిణి తూర్పు ముఖంగా ఉండాలి. తద్వారా ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.
>> వాయువ్య దిశలో వంటగదిని నిర్మిస్తే, ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
>> వాయువ్య దిశలో వంటగదిని నిర్మించడం వల్ల స్నేహితులకు ఇచ్చిన డబ్బు త్వరగా తిరిగి రాదు.
>> వంటగదిని వాయువ్య దిశలో నిర్మించినట్లయితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది.
>> ఉత్తర దిక్కు కుబేరుని స్థానం, ఈ దిశలో వంటగది నిర్మిస్తే.. వారి సంపద దహనమవుతుంది.
>> ఉత్తరం దిశలో వంటగది ఉంటే.. వారి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది.
Also Read: Monday Remedies: మీరు అపారమైన డబ్బు పొందాలంటే.. సోమవారం శివుడిని ఇలా పూజించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook