Vastu Tips: ఇంట్లో పరిగెత్తే ఏడు గుర్రాల ఫోటోను పెట్టుకుంటే.. మీ కెరీర్ కూడా అలా దూసుకుపోతుంది! ఏ దిశలో పెట్టాలో తెలుసుకోండి
Vastu tips in Telugu: కొంతమంది తమ ఇళ్లలో పరుగెత్తే ఏడు గుర్రాల చిత్రాలను ఉంచడం మీరు చూసి ఉంటారు. ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.
Vastu tips in Telugu: తరచుగా మీరు చాలా మంది ఇళ్లలో ఏడు గుర్రాల ఫోటోను (7 horse Photo) చూసే ఉంటారు. అయితే ఈ చిత్రాన్ని పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే ప్రశ్న మీ మనస్సులో తలెత్తుతుంది. ఈ చిత్రం అందంగా కనిపించడమే కాకుండా... అదృష్టాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. ఈ చిత్రాన్ని ఇంట్లో ఉంచుకుంటే కుటుంబంలో పురోగతితోపాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ముందుగా ఏ దిశలో ఉంచాలనేది తెలుసుకోవాలి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడు గుర్రాల బొమ్మను ఏ దిశలో ఉంచాలి?
1. మీరు ఈ ఫోటోను మీరు ఆఫీసు క్యాబిన్‌లో ఉంచినట్లయితే.. గుర్రం ముఖం కార్యాలయం లోపలి వైపుకు వచ్చేలా చూసుకోండి. ఈ చిత్రాన్ని దక్షిణ దిశలో ఉంచాలి.
2. మీరు ఈ చిత్రాన్ని ఇంట్లో ఉంచినట్లయితే, ఈ ఫోటోను తూర్పు దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ చిత్రం కెరీర్‌లో పురోగతిని తెస్తుంది మరియు వ్యక్తి యొక్క గౌరవాన్ని కూడా పెంచుతుంది. మీరు ఈ చిత్రాన్ని ఇంటి హాలులో ఉంచినట్లయితే, మీరు దానిని దక్షిణ దిశలోని గోడపై కూడా ఉంచవచ్చు.
(Note: ఈ స్టోరీలోని సమాచారం ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. Zee Telugu News దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Venus Transit 2022: బుధుడు-శుక్రుడు సంయోగం.. జూన్ 18 నుంచి ఈ రాశులవారిపై డబ్బు వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook