Mars, Venus conjunction : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే రాశిలోకి శుక్రుడు, కుజుడు రావడంతో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. ధనుస్సు రాశిలోకి (Sagittarius) శుక్రుడు, కుజుడు పరివర్తనం వల్ల​ 3 రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. మరి ఆ 3 రాశుల ఏమిటి, ఆ రాశులపై ప్రభావం ఏమిటో ఒకసారి చూడండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి (Gemini) 
శుక్రుడు, కుజుడు ఒకే రాశిలోకి రావడంతో మిథురాశి వారికి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనోన్యంగా ఉంటారు. ఇక వ్యాపారంలో ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి వారికి ఇదే సరైన సమయం. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 


వృశ్చికరాశి (Scorpio) 
వీరికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. అలాగే పలు శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లోనూ సానుకూలంగా ఫలితాలు అందుకుంటారు. అలాగే చాలా రోజులుగా వేరే వ్యక్తుల దగ్గర నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావడంతో శుక్రుడు, కుజుడు ఒకే రాశిలోకి రావడంతో ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


Also Read: Khiladi Full Kicku Song: రవితేజ బర్తే డే సర్ ప్రైజ్.. ఖిలాడి సినిమాలోని ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్!


కుంభ రాశి (Aquarius)
కుజుడు, శుక్రుడు ఒకే రాశిలోకి రావడంతో కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి రోజువారీ ఆదాయం పెరుగుతుంది. మీడియా, మెడికల్, ఆర్ట్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్స్‌లలో పని చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. (Zodiac Signs)


Also Read: AP Corona cases: ఏపీలో ఆగని కరోనా కల్లోలం- ఒక్క రోజులో 9 మంది మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook