Panchagrahi Yogam Effect: ఒకే రాశిలోకి ఐదు గ్రహాలు.. ఆ మూడు రాశుల వారికి అష్టకష్టాలు!

Three Zodiac Sign People will be effect : ఒకేసారి ఐదు గ్రహాలు ఒకే రాశిలో రావడంతో.. కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా మేలు జరగనుంది. మరి ప్రభావాలు.. లాభాలు ఏమిటో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 04:57 PM IST
  • మరికొన్ని రోజుల్లో అనేక ముఖ్యమైన గ్రహ మార్పులు
  • ఈ మార్పుల వల్ల అన్ని రాశులపై ప్రభావం
  • శనిదేవుడి రాశి అయిన మకరరాశిలో 5 గ్రహాలు
  • జ్యోతిష్యశాస్త్ర ప్రకారం చాలా మార్పులు
Panchagrahi Yogam Effect: ఒకే రాశిలోకి ఐదు గ్రహాలు.. ఆ మూడు రాశుల వారికి అష్టకష్టాలు!

Panchgrahi Yogam Effect : 2022 సంవత్సరంలో మొదటి నెల జనవరి మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. అయితే మరికొన్ని రోజుల్లో అనేక ముఖ్యమైన గ్రహ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పుల వల్ల అన్ని రాశులపై (Zodiac Signs) ప్రభావం పడనుంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరి శనిదేవుడి (Saturn) రాశి అయిన మకరరాశిలోనే 5 గ్రహాలు ఉంటాయి. 

మకరరాశిలో (Capricorn) అంగారకుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, శని గ్రహాలుంటాయి. ఇలా ఏకకాలంలో 5 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల జ్యోతిష్యశాస్త్ర ప్రకారం చాలా మార్పులు రానున్నాయి. మొత్తం 12 రాశులపై ఈ ప్రభావం పడనుంది.

ప్రస్తుతం మకరరాశిలో శని, సూర్యుడు, బుధుడు గ్రహాలున్నాయి. మరోవైపు కుజుడు, బుధుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించనున్నాయి. ఇలా ఐదు గ్రహాలు (Five Planets) ఒకే రాశిలోకి రావడాన్ని పంచగ్రహి యోగం అంటారు.

మకరరాశిలో ఐదు గ్రహాలు ఉండడం (5 planets in Capricorn) వల్ల 3 రాశుల వారికి చాలా మేలు జరగనుంది. ఈ పంచగ్రహి యోగం వల్ల మేష, వృషభ, మీన రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. 

Also Read : Padma Shri: పద్మ శ్రీ ప్రకటనపై గరికిపాటి నరసింహారావు ఆనందం!

ఇక పంచగ్రహి యోగం వల్ల 3 రాశుల వారికి చాలా నష్టాలు తలెత్తుతాయి. ధనుస్సు, (Sagittarius) కుంభం, మిథున రాశుల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. వీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశుల వారు అనారోగ్యం బారినపడిన అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ మూడు రాశుల (Zodiac Signs) వారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

Also Read: Video: విష సర్పాన్నే బెంబేలెత్తించిన తల్లి ఎలుక.. పిల్ల ఎలుక కోసం ఎంత ఆరాటమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News