Venus transit 2023 in Taurus 2023: జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. ఇతడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నిన్న అంటే ఏప్రిల్ 06వ తేదీన వృషభరాశిలోకి  ప్రవేశించాడు. శుక్రుడు మే 2 వరకు అదే రాశిలో ఉంటాడు. అనంతరం అతడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా రాబోయే 25 రోజులపాటు కొన్ని  రాశులవారు తీవ్రంగా ఇబ్బందుల పడనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు: శుక్రుని సంచారం ధనస్సు రాశి వారిని ఇబ్బంది పెడుతుంది. తీసుకున్న అప్పును ఇవ్వలేరు. తద్వారా మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. లవర్స్ మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిస రాదు. 


మిథునం: శుక్రుడి గోచారం వల్ల మిధున రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. మీ దాంపత్య జీవితంలో టెన్షన్ ఉంటుంది. మీకు ఉద్యోగం రావడానికి కొంత సమయం పడుతుంది.  వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.  


Also Read: Jupiter Rise 2023: గురు గ్రహం మేషరాశిలో ఉదయం, 5 రాశులకు ఉన్నత పదవులు, అంతులేని డబ్బు


తుల: తులారాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారుతుంది. మీరు అప్పు తీసుకోవాల్సి రావచ్చు. వ్యాపారులు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడికి ఇది తగిన సమయం కాదు. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. 


మీనం: శుక్రుడి రాశి మార్పు మీన రాశి వారికి కెరీర్ లో సమస్యలను తెచ్చిపెడుతుంది. జాబ్ ఛేంజ్ కావడానికి ఇది తగిన సమయం కాదు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. దీని కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. 


Also read: Budh Vakri 2023: బుధుడి తిరోగమనంతో ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook