Mercury Retrograde in Aries on 21st April 2023: హిందూ జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుద్ధి, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. మిథున మరియు కన్యా రాశికి అధిపతిగా బుధుడిని భావిస్తారు. రీసెంట్ గా మెర్క్యూరీ మేషరాశిలో సంచరించాడు. జూన్ 07 వరకు గ్రహాల యువరాజు అదే రాశిలో ఉంటాడు. అనంతరం ఫ్లానెట్ ప్రిన్స్ వృషభరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ఈ ప్రయాణ సమయంలో మెర్క్యూరీ ఏప్రిల్ 21 మధ్యాహ్నం 2.05 గంటలకు తిరోగమనం చేయనున్నాడు. మేషరాశిలో బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
కుంభ రాశి:
కుంభ రాశి యెుక్క ఐదో మరియు ఎనిమిదో గృహాలకు బుధుడు అధిపతి. దీంతో మెర్క్యూరీ మీ యెుక్క మూడో ఇంట్లో సంచరించనున్నాడు. మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు ఫారిన్ ట్రిప్ వెళ్లే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి.
మీనరాశి:
మీన రాశి యెుక్క నాల్గవ మరియు ఏడవ ఇంటికి బుధుడు అధిపతి. మీ జాతకంలో రెండో ఇంట్లో మెర్క్యూరీ సంచరిస్తున్నాడు. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడించనున్నారు. తిరోగమన బుధుడు మీకు అదృష్టాన్ని ఇవ్వనున్నాడు. మీరు పొదుపు చేసే అవకాశం ఉంది.
మేషరాశి:
ఈ రాశి యెుక్క మూడో మరియు ఆరో ఇంటికి బుధుడు అధిపతి. మెర్క్యూరీ తిరోగమనం మేషరాశి యెుక్క మెుదటి ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీ కెరీర్ దూసుకుపోతుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. జాబ్ చేసేవారు ప్రమోషన్ లభిస్తుంది.
Also Read: Surya Gochar 2023: వచ్చే నెల రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
సింహరాశి:
సింహ రాశి యెుక్క రెండవ మరియు పదకొండవ ఇంటికి బుధుడు అధిపతి. మీ జాతకంలోని తొమ్మిదవ ఇంట్లో మెర్క్యూరీ తిరోగమనం చేయనున్నాడు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. సింహరాశివారికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
Also Read: Chaturgrahi Yog: 12 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook