అంతులేని ధన సంపద, ప్రేమను పంచే శుక్రుడు, శని గ్రహాలు జనవరి 22వ తేదీ రాత్రి కుంభరాశిలో ప్రవేశించాయి. శుక్ర గోచారం ప్రభావంతో ఏర్పడిన శని-శుక్ర యుతి 5 రాశులకు అత్యంత శుభసూచకం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 9 గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మారుతుంటాయి. గ్రహాల గోచారంతో జీవితాలపై అద్భుత ప్రభావం పడనుంది. ధనం, విలాసం, ప్రేమ, సుఖాలకు కారకుడైన శుక్రుడు..శని రాశి అయిన కుంభరాశిలో ప్రవేశించాడు. శుక్ర గోచారంతో కుంభరాశిలో శని, శుక్ర గ్రహాల యుతి ఏర్పడింది. ఎందుకంటే కుంభరాశిలో శనిగ్రహం జనవరి 17నుంచే ఉన్నాడు. ఇప్పుడు కుంభరాశిలో శుక్రుడు ఫిబ్రవరి 15 వరకూ ఉంటాడు. అప్పటి వరకూ అంటే రానున్న 23 రోజులు ఈ 5 రాశులపై కనకవర్షం, ధనలాభం, సుఖ సంతోషాలు కలగనున్నాయి.


కుంభరాశిలో శుక్ర గోచారంతో మారనున్న 5 రాశుల జీవితాలు


మేషరాశి


పనిలో లేదా వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ప్రత్యేకించి భాగస్వామ్యంలో పనిచేసవారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ధనలాభముంటుంది. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సమృద్ధి ఉంటుంది. 


మిథున రాశి


శుక్ర గోచారం మిధున రాశికి చాలా శుభ సూచకం. పని వ్యవహారాల్లో అభివృద్ధి లభిస్తుంది. అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మీలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. 


సింహరాశి


శుక్రుడి గోచారంతో సింహరాశివారికి చాలా లాభాలుంటాయి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమికుల్లో ప్రేమలో మునిగితేలుతారు. పెళ్లికానివారి జాతకం మారుతుంది. జీవిత భాగస్వామి లభిస్తారు. పెళ్లి నిశ్చయమౌతుంది. కెరీర్‌లో గోల్డెన్ అవకాశాలు లభిస్తాయి.


మకర రాశి


మకర రాశి వారికి శుక్ర గోచారం ఊహించని లాభాల్ని ఇస్తుంది. ఒకేసారి లాభాలు కలుగుతాయి. చాలా సమస్యలు దూరమౌతాయి. కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. కొత్త ఉద్యోగాలు లభించే యోగం ఏర్పడుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.


కుంభరాశి


శుక్ర గోచారం కుంభ రాశిలో ఉండటం వల్ల అన్నింటికంటే ఎక్కువ లాభం ఈ రాశికే ఉంటుంది. ప్రతి పనిలో అదృష్టం తోడుగా ఉంటుంది. కెరీర్‌లో అభివృద్ధి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు లాభాలు ఆర్జిస్తాయి. మీ అభివృద్ధి ఉంటుంది. 


Also read: Mercury Venus Conjunction: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది! ప్రభుత్వ ఉద్యోగం పక్కా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook