Mercury Venus Conjunction: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది! ప్రభుత్వ ఉద్యోగం పక్కా

These 3 Zodiac Sign Peoples will get Huge Money afater Conjunction of Mercury and Venus in Aquarius 2023. కుంభ రాశిలో బుధ, శుక్రుల కలయిక వల్ల 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడబోతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 22, 2023, 06:52 PM IST
  • అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం
  • ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది
  • ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం
Mercury Venus Conjunction: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది! ప్రభుత్వ ఉద్యోగం పక్కా

Gemini Signs will get Government job due to Laxmi Narayan Rajyog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి నెల ఒకటి లేదా రెండు గ్రహాలు దాని కదలికను మారుస్తుంటాయి. ఈ గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే.. వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి రాశిచక్రం ఏదో ఒక గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఫిబ్రవరి 2023లో చాలా గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటాయి. ఈ క్రమంలో కుంభ రాశిలో బుధ, శుక్రుల కలయిక వల్ల 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడబోతోంది. జ్యోతిషశాస్త్రంలో ఈ రాజయోగం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం ప్రభావం కారణంగా 3 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారి జాతకంలో నాల్గవ ఇంట్లో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దాంతో ఈ రాశి వారికి ఈ యోగం ఫలవంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి మద్దతు లభిస్తుంది. అధిక ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. భౌతిక సుఖాలు లభిస్తాయి. మీరు ఆస్తి మరియు వాహనాలను కూడా కొనుగోలు చేయవచ్చు.

సింహ రాశి:
బుధ, శుక్రుల కలయికతో ఏర్పడిన లక్ష్మీ నారాయణ రాజయోగం సింహ రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. సింహ రాశిలో ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వైవాహిక జీవితం మరియు భాగస్వామ్యంకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది. దాంతో ఈ రాశి వారి ఉద్యోగస్తులకు పురోగతికి అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు త్వరలో వివాహం జరుగుతుంది. భాగస్వామ్యంతో చేసే ఏ పని అయినా భారీ లాభాలను ఇస్తుంది.

మిథున రాశి:
మిథున రాశి వ్యక్తుల జాతకంలో తొమ్మిదో ఇంట్లో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు విజయం సాధిస్తారు.

Also Read: India ICC ODI Ranking: న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలిస్తే.. టీమిండియాదే అగ్రస్థానం!  

Also Read: Athiya Shetty-KL Rahul Wedding: ఫామ్ హౌస్‌లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి.. స్పష్టం చేసిన సునీల్ శెట్టి! వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News