Financial lessons from Lord Vinayaka :వినాయకుడి నుంచి తెలుసుకోవాల్సి ఆర్థిక పాఠాలు ఇవే
Financial lessons to be learned from God Vinayaka : ఏనుగు తల ఉన్న ఆ విఘ్నేశ్వరుడు (vigneshwara) చిన్న ఎలుకపై పయనిస్తాడు. అయితే ఇందులో చాలా ఆర్థిక అంశాలు దాగి ఉన్నాయి.
Vinayaka chavithi, Financial lessons to be learned from God Vinayaka : వినాయక చవితి వచ్చిదంటే మండపాలు కట్టి గణేషుడికి (God Ganesha) ఘనంగా పూజలు చేస్తాం. ఇంట్లో విగ్రహం పెట్టి పూజిస్తాం. ఎందుకంటే లంబోదరుడికి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తే ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనల్ని కాపాడతాడనేది భక్తుల విశ్వాసం. అయితే వినాయకుడు నుంచి తెలుసుకోవాల్సి ఆర్థిక పాఠాలూ కూడా చాలానే ఉన్నాయి. ఏనుగు తల ఉన్న ఆ విఘ్నేశ్వరుడు (vigneshwara) చిన్న ఎలుకపై పయనిస్తాడు. అయితే ఇందులో చాలా ఆర్థిక అంశాలు దాగి ఉన్నాయి. మన జీవితం చాలా సరళంగా ఉంటూనే మన ఆలోచనలు చాలా లోతుగా ఉండాలనేది అందులోని నీతి. ఈ విషయాన్ని మనకు వినాయకుడు (Vinayakudu) చెప్పకనే చెబుతాడు. మన ఖర్చుల కంటే పొదుపు ఎక్కువగా ఉండాలని సూచిస్తారు లంబోదరుడు. మన బడ్జెట్ తెలుసుకుని దానికే కట్టుబడి ఉండాలని వినాయకుడు మనకు సూచిస్తారు. అవసరాలకు తగ్గట్లుగా ఖర్చు చేయాలి. అలాగే రేపటి కోసం ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. అనవసరంగా అప్పుల్లో కూరుకోపోకూడదు.
ఇక వినాయకుడి పెద్ద ఏనుగు తల నుంచి కూడా మనం చాలా గ్రహించవచ్చు. విఘ్నేశ్వరుడి తల ఆలోచనలు, విజ్ఞానం, దూరదృష్టికి నిదర్శనం. కొందరు పెట్టుబడిదార్లు (Investors) మార్కెట్లు బాగా పెరిగాయనో లేదా తగ్గాయనో తమ దగ్గరున్నదంతా పెట్టుబడిగా పెట్టేస్తూ ఉంటారు. అయితే అలా ముందూవెనుకా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం అనేది అనర్థం. వినాయకుడి నుంచి దూరదృష్టి సూత్రాన్ని మనం పాటిస్తే ఇలాంటి ఆర్థిక విషయాల్లో గట్టెక్కవచ్చు.
పెద్ద చెవులు చెప్పే సూత్రం ఇదే
లంబోదరుడి పెద్ద చెవుల ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. మనకు ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వినాలి అని వినాయకుడి నుంచి మనం గ్రహించాలి. గజకర్ణుడు తనకున్న పెద్ద చెవుల ద్వారా చాలా విషయాలనే మనకు చెప్తారు. ఆర్థిక విషయాలకు (financial matters) సంబంధించి ఎక్కువగా వినడం అలావాటు చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు వినాలి.
Also Read : Old Lady Dance on Bullet Bandi Song: బుల్లెట్ బండి పాటపై 70 ఏళ్ల బామ్మ డ్యాన్స్ (Video)
లంబోదరుడి బొజ్జ చెప్పే సూత్రం
వినాయకుడి బొజ్జలోకి ఎలాంటిదైనా సరే వెళ్లిపోవాల్సిందే.. అరిగిపోవాల్సిందే. అయితే లంబోదరుడి బొజ్జ చెప్పే సూత్రం ఏంటంటే.. మనం మార్పులను త్వరగా ఆకలింపు చేసుకోవాలి. వాటికి తగినట్లుగా నడుచుకోవాలి. మంచి పెట్టుబడుదారులు తమ బడ్జెట్‌కు (Budget) అనుగుణంగా పెట్టుబడులను పెంచుకుంటూ పోతారు. క్రమం తప్పకుండా వాటిని పరిశీలిస్తారు. అప్పుడే కదా ప్రయోజనాలు అందేది. మన పెట్టుబడులు (Investments) మన లక్ష్యాల దిశగా వెళ్లకపోతే వెంటనే మార్పు చేర్పులు చేసుకోవాలి.
వినాయకుడు (Vinayakudu) విఘ్నాలన్నింటినీ తొలగిస్తారని మన నమ్మకం. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థిక ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి. గణేశుడిలాగే మన జీవితంలో అత్యంత ప్రాధాన్య విషయాలకే ఎక్కువగా ప్రిపరెన్స్ ఇవ్వాలి. అయితే జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కాబట్టి అందుకు తగ్గట్లుగా అత్యవసరాలకు తగినట్లుగా మన దగ్గర డబ్బులు తీసుపెట్టుకోవాలి.
Also Read : Shiva puja on Monday: శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా ? సోమవారం ప్రత్యేకత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook