T20 World Cup 2022: భారత్‌పై విధ్వంసం సృష్టించిన ప్లేయర్ వరల్డ్ కప్‌లోకి ఎంట్రీ.. ఇక బాదుడే బాదుడు
ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టించిన ఆసీస్ ఓపెనర్ కామెరాన్ గ్రీన్ ప్రపంచ కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల బ్యాకప్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గాయం కావడంతో మెగా టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో కామెరూన్ గ్రీన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అయితే బ్యాకప్ కీపర్ లేకుండానే టీ20 వరల్డ్ కప్ ఆడననుంది ఆసీస్ జట్టు.
Cameron Green In T20 World Cup: ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టించిన ఆసీస్ ఓపెనర్ కామెరాన్ గ్రీన్ ప్రపంచ కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల బ్యాకప్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గాయం కావడంతో మెగా టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో కామెరూన్ గ్రీన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అయితే బ్యాకప్ కీపర్ లేకుండానే టీ20 వరల్డ్ కప్ ఆడననుంది ఆసీస్ జట్టు.
న్యూ సౌత్ వేల్స్ గోల్ఫ్ క్లబ్‌లో ఆసీస్ ఆటగాళ్లు గోల్ఫ్ ఆడుతుండగా.. జోష్ ఇంగ్లిస్ గాయపడ్డాడు. అతడిని పరీక్షించిన తరువాత టీ20 వరల్డ్ కప్‌కు దూరమైనట్లు ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా వికెట్ కీపర్లు బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్ఫె, అలెక్స్ కేరీల్లో ఒకరిని తీసుకుంటారని అందరూ అంచనా వేశారు. అయితే కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పినట్లుగానే ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు జట్టులో చోటు దక్కించుకున్నాడు.
భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గ్రీన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్‌గా అవకాశం ఇస్తే ఎలా విధ్వంసం సృష్టించగలడో చూపించాడు. అటాకింగ్ ఓపెనర్‌గా గ్రీన్‌కు టాప్-11లో చోటు దక్కే అవకాశం కూడా ఉంది. గ్రీన్ ఓపెనర్‌గానే కాకుండా.. 140 kph స్పీడ్‌తో కూడా బౌలింగ్ చేయగలడు.
23 ఏళ్ల కామెరూన్ గ్రీన్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడు టీ20 మ్యాచుల్లో 136 పరుగులు చేసి ఐదు వికెట్లు కూడా తీశాడు. ఈ లెక్కలు చూస్తే అతను సాధారణంగా ప్లేయర్ అనిపించవచ్చు. అనిపించవచ్చు. కానీ ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో అదరగొట్టాడు. మొదటి T20 మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లో 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను గెలిపించాడు. చివరి మ్యాచ్‌లో కూడా కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. తుది జట్టులో గ్రీన్‌కు చోటు దక్కితే సొంతగడ్డపై వరల్డ్ కప్‌లో కచ్చితంగా విధ్వంసం సృష్టిస్తాడని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే బ్యాకప్ కీపర్ లేకుండా మెగా టోర్నీలో ఆసీస్ సాహసం చేస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం జట్టులో మాథ్యూ వేడ్ మాత్రమే రెగ్యూలర్ వికెట్ కీపర్ ఉన్నాడు. ఒక వేళ అతను గాయపడితే.. జట్టులో మిగిలిన ఆటగాళ్లలో ఎవరికో ఒకరికి గ్లౌవ్స్ అప్పగించాల్సి ఉంటుంది. కానీ టీమ్‌లో ఉన్న వారిలో ఎవరికీ కూడా కీపింగ్ చేసిన అనుభవం లేకపోవడం మైనస్.
Also Read:Omicron Variant BF 7: దీపావళి వేళ అలర్ట్.. భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి