Babar Azam breaks Virat Kohli's record: పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్​ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మరో రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్​లో (T20 World cup 2021) టీమ్​ ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ రికార్డును (Virat Kohili) దాటి.. ఈ ఘనతను సాధించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్​లో భాగంగా.. నిన్న రాత్రి (శుక్రవారం) పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (Pak vs Afg match news) తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్​-2లో వరుసగా మూడు మ్యాచ్​లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ నిలిచిది.


వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి.. ఆ జట్టు సెమీస్‌కు మరింత చేరువైంది. మిగిలిన మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌, నమీబియా లాంటి చిన్న జట్లతో తలపడాల్సి ఉంది. దీనితో సెమీస్‌పై పాక్ జట్టు ధీమాగా ఉంది.


Also read: Afg vs Pak Match Highlights: టీ20లో హ్యాట్రిక్ కొట్టిన పాక్.. ఆఫ్గనిస్తాన్‌పై పాక్ ఘన విజయం


Also read: T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్


బాబర్ అజామ్​ రికార్డు ఇది..


శుక్రవారం జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​ 20 ఓవర్లలో 147/6 స్కోర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19 ఓవర్లలోనే విజయం సాధించింది. పాక్ ఆటగాడు అసిఫ్‌ అలీ ఒకే ఓవర్​లో నాలుగు సిక్సర్లు బాది పాక్​కు ఘన విజయం అందించాడు. 


అంతకుముందు బాబర్‌ అజామ్‌ 47 బందుల్లో అర్ధశతకంతో (51 పరుగులు) మెరిశాడు. ఈ క్రమంలోనే అతడు టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. 26 ఇన్నింగ్స్​లోనే బాబర్ అజామ్ ఈ ఘనతను సాధించడం గమనార్హం. టీమ్​ ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ ఈ రికార్డును 30 ఇన్నింగ్స్​లో అందుకున్నాడు.


దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ డుప్లెసిస్‌ 31 ఇన్నింగ్స్​లో, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 32 ఇన్నింగ్స్​లో, న్యూజిలాండ్‌ కెప్టెన్​ కేన్‌ విలియమ్సన్‌ 36 ఇన్నింగ్స్​లో ఈ ఘనత సాధించారు.


Also read: Warner imitate Ronaldo: రొనాల్డోను అనుకరించిన డేవిడ్​ వార్నర్​- ప్రెస్​ కాన్ఫరెన్స్​లో నవ్వులు!


Also read: David Warner IPL Auction: ‘సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే‘


రషీద్​ ఖాన్​ అరుదైన రికార్డు..


శుక్రవారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఆఫ్గానిస్తాన్ ఓడిపోయినా.. ఆ జట్టు బౌలర్​ రషీద్​ ఖాన్ అరుదైన (Rashid Khan new record) ఘనతను తన ఖాతాలో వేసుకున్నారుడు. 


గత మ్యాచ్‌లో అతడు.. బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ హఫీజ్‌ (10)లను ఔట్‌ చేయడం ద్వారా టీ20 ఫార్మాట్​లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ 76 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. రషీద్‌ 53 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు చేరుకోవడం విశేషం.


న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ 82 ఇన్నింగ్స్​లలో, బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ 83 ఇన్నింగ్స్‌లతో ఈ ఘనతను సాధించారు. వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గాను రషీద్ రికార్డు నమోద చేశాడు. వన్డే, టీ20 రెండు ఫార్మాట్లలోనూ ఈ ఘతన రషీద్​పైనే ఉండటం విశేషం.


Also read: INDIA vs Pak: భారత్-పాక్ టీ20 మ్యాచ్​పై ఆగని వివాదాలు.. కొనసాగుతున్న అరెస్ట్​లు


Also read: T20 rankings: టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC.. దిగజారిన కోహ్లీ, రాహుల్ ర్యాంకులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook