INDIA vs Pak: భారత్-పాక్ టీ20 మ్యాచ్​పై ఆగని వివాదాలు.. కొనసాగుతున్న అరెస్ట్​లు

India Pak T20 Match: టీ20 మ్యాచ్​లో భారత్​పై పాకిస్థాన్​ విజయం సాధించిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో వివాదం మొదలైంది. పాక్​కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్​ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 11:57 AM IST
  • భారత్, పాక్​ టీ20 మ్యాచ్​పై కొనసాగుతున్న వివాదాలు
  • ఇప్పటి వరకు ఎనిమిది మంది అరెస్ట్
  • రాజస్థాన్ టీచర్​కు బెయిల్​ మంజూరు
INDIA vs Pak: భారత్-పాక్ టీ20 మ్యాచ్​పై ఆగని వివాదాలు.. కొనసాగుతున్న అరెస్ట్​లు

IND vs PAK : ఇండియా- పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్​పై దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​ విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ పలువురు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. పాక్​ విజయాన్ని ఆస్వాధిస్తు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిని.. వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్స్​ వస్తున్నాయి.

అయితే ఇదే సమయంలో పాక్​ క్రికెట్​ జట్టుకు అనుకూలంగా పోస్ట్​ పెట్టిన వారికి కొంత మంది మద్దతుగా కూడా నిలిస్తున్నారు. ఆటలో వేరే జట్టుకు మద్దతు ఇవ్వడం తప్పెలా అవుతుందని వాదిస్తున్నారు.

ఎనిమిది మంది అరెస్ట్​..

ఈ వివాదాల నేపథ్యంలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వ్యాఖ్యలు చేసిన నలుగురిని ఉత్తర్ ప్రదేశ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్​లో ఓ ప్రైవేటు ఉపాద్యాయురాలిని కూడా అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు ఆగ్రాలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కావడం గమనార్హం. ఈ వివాదం కారణంగా ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ కూడా చేసింది. ఆ ముగురు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలు సంఘాలు డిమాండ్​ చేశాయి. కశ్మీర్​లో కూడా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే రాజస్థాన్​లో అరెస్టయిన ప్రైవేటు టీచర్​ నఫీసా అట్టారి వివాదం మలుపు తిరిగి.

Also read: T20 World Cup 2021: తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మేలే చేస్తోంది: గ్రేమ్‌ స్వాన్‌

Also read: Babar Azam about Ind vs Pak match result: ఇండియాపై పాక్ విజయంపై బాబర్ ఆజం ఏమన్నాడంటే..

ఇంతకి ఏమైందంటే..

మ్యాచ్​లో పాకిస్థాన్​ విజయం సాధించిన తర్వాత.. నఫీసా వాట్సాప్​లో ఓ స్టేట్​ పెట్టారు. ఆ స్టేటస్​ చూసిన ఒకరు పాక్​కు సపోర్ట్ చేస్తున్నారా? అని వాట్సాప్​లోనే ప్రశ్నించగా.. అవునని అర్థం వచ్చేలా ఉన్న ఓ ఈ మోజీని సమాధానంగా పంపారు నఫీసా. దీనితో ఈ ఛాటింగ్​కు సంబంధించిన స్క్రీన్​ షాట్​ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనితో ఆమె పని చేస్తున్న స్కూలు యాజమాన్యం తనను తొలగించింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ వివాదాలన్నింటి నేపథ్యంలో నఫీసా ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను పెట్టిన పోస్ట్​పై వివరణ ఇచ్చారు. 

వాట్సాప్​లో తాను సరదాగా ఇచ్చిన సమాధానమన్నారు. అంత మాత్రానా తాను పాక్​కు మద్దతు ఇస్తున్నట్లు కాదని.. వెల్లడించారు. అందరిలాగే తనకు భారత్ అంటే ప్రేమ ఉందని వివరించారు.
అయితే తాను వాట్సాప్​లో పెట్టిన స్టేటస్, రిప్లై తప్పుగా ఉన్నాయని గ్రహించి వెంటనే వాటిని డిలీట్​ చేశానని నఫీసా వివరణ ఇచ్చారు. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కోరారు.

ఎవరి మనోభావాలు కించపరచడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ఆమె వాదనతో ఏకీభవించిన కోర్టు బుధవారం సఫీసాకు బెయిల్ మంజూరు చేసింది.

Also read: IND vs PAK: ఇండియాని ఓడించాక పాకిస్తాన్‌ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే...!

Also read: Kohli Comments On Rohit Sharma: రోహిత్​ శర్మను టీ20 ఫార్మాట్​ నుంచి తొలగించాలా?

రాజకీయంగా రగడ..

ఆగ్రాలో విద్యార్థుల అరెస్ట్​, కశ్మీర్​లో పాక్ మద్దతుదారులను అదుపులోకి తీసుకోవడంపై రాజకీయంగా రగట రాజుకుంటోంది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అరెస్టులను ఖండించారు. జమ్ము కశ్మీర్​ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఈ విషయమై ముఫ్తీపై విమర్శలు గుప్పించారు. ఆమెది తాలిబన్ మనస్థత్వమంటూ ఆరోపణలు చేశారు.

Also read: India Vs Pakistan: 'ఇది కదరా.. అసలైన హుందాతనం'.. ధోని, విరాట్ వీడియో వైరల్

Also read: IND vs PAK Match: ఇండియా పాక్ మ్యాచ్‌పై నెటిజన్ల స్పందన, అంపైర్‌పై మండిపాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News