BAN Vs SL Test Highlights: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త డీఆర్ఎస్.. కళ్లు కనిపించలేదా భయ్యా..!
Bangladesh Takes Worst DRS: క్రికెట్ ఆటగాళ్లందరిలో పాకిస్థాన్ ఆటగాళ్లు వేరయా అని విన్నాం గానీ.. ఇప్పుడు ఈ జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేరేలా ఉన్నారు. డీఆర్ఎస్ ఉంది కదా అని వెనుక ముందు ఏమాత్రం ఆలోచించకుండా పరువు పొగొట్టుకున్నాడు బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో. బ్యాట్‌కు క్లియర్‌గా తాకినా.. డీఆర్ఎస్ కోరి నవ్వులపాలయ్యాడు.
Bangladesh Takes Worst DRS: బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శనివారం ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో తీసుకున్న నిర్ణయంతో నవ్వులపాలయ్యాడు. క్రికెట్ చరిత్రలో ఎన్నో డీఆర్ఎస్‌లు చూసుంటారు కానీ.. శాంటో తీసుకున్న సమీక్ష మాత్రం ఎప్పుడు చూసుండరు. శ్రీలంక ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్ వేస్తుండగా.. స్ట్రైకింగ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ ఉన్నాడు.
Also Read: Punjab Girl Dies: ఘోర విషాదం.. పుట్టినరోజున కేక్ తిని చిన్నారి మృతి, ఫ్యామిలీ సీరియస్..
తొలి నాలుగు బంతులకు పరుగులేమి రాలేదు. ఐదు బంతిని మెండిస్ డిఫెన్స్ ఆడాడు. అయితే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో.. బాల్ ప్యాడ్లకు తగిలిందనుకున్నాడు. బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్లు ఎవరూ అప్పీల్ చేయకున్నా.. శాంటో మాత్రం ఎల్బీ కోసం అడిగాడు. సహచరులతో పెద్దగా డిస్కస్ చేయకుండానే డీఆర్ఎస్ కోరాడు. రివ్యూలో బాల్ బ్యాట్‌కు తగిలినట్లు క్లియర్‌గా తేలిపోయింది. దీంతో తన నిర్ణయంపై తానే నవ్వుకున్నాడు శాంటో. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త డీఆర్ఎస్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. తరువాత బంతికే మెండిస్ బౌండరీ బాదాడు.
అంతకుముందు శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన కసున్ రజిత స్థానంలో అసిత ఫెర్నాండో జట్టులోకి వచ్చాడు. రజిత మొదటి టెస్ట్‌లో శ్రీలంక విజయంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు మధుష్క (57), కరుణరత్నే (86) గట్టి పునాది వేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అనంతరం వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 150 బంతుల్లో 93 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సీనియర్ ప్లేయర్ ఏంజెలో మ్యాథ్యూస్ 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. దినేశ్ చండీమాల్ (34), ధనుంజయ డిసిల్వా (15) నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో హాసన్ మహ్మద్‌కు రెండు వికెట్లు దక్కగా.. షకీబుల్ హసన్ ఒక వికెట్ తీశాడు.
Also Read: Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!
Also Read: Heat Waves: రానున్న 3-4 రోజుల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి