Punjab Girl Dies: ఘోర విషాదం.. పుట్టినరోజున కేక్ తిని చిన్నారి మృతి, ఫ్యామిలీ సీరియస్..

Punjab Girl Dies: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బర్త్ డే వేడుకలకు గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దగ్గరలోని బేకరీ నుంచి కేక్ ఆర్డర్ పెట్టారు. బంధువులు, చిన్నారులను ఇంటికి పిలిచి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కానీ ఇంతలో జరిగిన ఘటన పంజాబ్ కుంటుంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 30, 2024, 10:41 PM IST
  • బర్త్ డే వేడుకల్లో ఊహించని ఘటన..
  • కేక్ తిని అస్వస్థతకు గురైన ఫ్యామిలీ..
Punjab Girl Dies: ఘోర విషాదం.. పుట్టినరోజున కేక్ తిని చిన్నారి మృతి, ఫ్యామిలీ సీరియస్..

On Her Birthday Punjab Girl Dies After Eating Birthday Cake: కొన్నిసార్లు మనం హోటల్స్, రెస్టారెంట్లకు సరదాగా తినడానికి వెళ్తుంటాం. అలాంటి సమయంలో ఫుల్ గా తిన్నాక ఇంటికి వచ్చేస్తుంటాం. కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అవుతుంటాయి. మరికొందరు తీవ్రంగా అస్వస్థతకు గురౌతుంటారు. ఇలాంటి సమయాల్లో కొందరు వెంటనే ఆస్పత్రులకు వెళ్తుంటారు. కానీ కొన్నిసమయాల్లో కొందరి ఆరోగ్యం విషమించి చనిపోతుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పంజాబ్ లో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.  వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని పాటియాలోలో..  గత వారం మాన్విఅనే చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా కేక్ తిని 10 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద ఫుడ్ పాయిజన్‌తో మరణించింది.

Read More: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

కేక్ తిన్న తర్వాత చెల్లెలు సహా బాలిక కుటుంబమంతా అస్వస్థతకు గురైందని ఆమె తాత తెలిపారు. పాటియాలాలోని ఓ బేకరీ నుంచి కేక్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు తెలిపారు. గత వారం.. మార్చి 24న రాత్రి 7 గంటల సమయంలో చిన్నారి మౌన్వీ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఆతర్వాత అదే రోజు రాత్రి   10 గంటల సమయంలో కుటుంబం మొత్తం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు వీరిని ఆస్సత్రికి తరలించారు. ఈక్రమంలో చిన్నారి మౌన్వీ చికింత్స అందిస్తుండగానే తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆరోజు రాత్రి చిన్నారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ ఆమె ఆరోగ్యం మరింతగా దిగజారింది. ఈక్రమంలో మరుసటి రోజు చిన్నారి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.  

బాధితురాలు, మౌన్వీ, ఆమె మరణానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియాలో ఆమె బర్త్ డే వేడుకలకు చెందిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకున్నారు. చిన్నారి మౌన్వీ ఆ వీడియోలో తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటుంది. దీంతో అక్కడి ప్రజలు కూడా చిన్నారిని తలుచుకుని కంటతడి పెడుతున్నారు.

Read More: Drinking Human Blood: మనిషి రక్తాన్ని జ్యూస్ లా తాగేస్తున్న యువతి.. వీక్లీ 36 లీటర్లేనంట.. ఎక్కడో తెలుసా..?

ఇదిలా  ఉండగా.. 'కేక్ కన్హా' అనే బేకరీ నుంచి ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్‌లో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశామని, కేక్‌లోని శాంపిల్‌ను కూడా పరీక్షల నిమిత్తం పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు.ప్రస్తుతం మౌన్వీ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో కొలుకుంటున్నట్లు సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News